Sunday, August 3, 2025

ఒటిటిలోకి రొమాంటిక్ కామెడీ సినిమా.. ఎప్పుడు స్ట్రీమింగ్ అంటే..

- Advertisement -
- Advertisement -

ప్రస్తుతం ఏ సినిమా అయినా థియేటర్‌కి వెళ్లి చూడటం కంటే ఒటిటిలో చూసేందుకు ప్రేక్షకులు ఎక్కువ ఇష్టపడుతున్నారు. దీంతో మేకర్స్ కూడా సినిమాలను త్వరగానే బుల్లితెరపైకి తీసుకువస్తున్నారు. అలా విడుదలైన నెల రోజుల్లోనే ఓ సినిమా ఒటిటిలో ప్రేక్షకులకు అందుబాటులోకి రానుంది. రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన ‘ఓహో ఎంథన్ బేబీ’ (Oho Enthan Baby) సినిమా త్వరలో ఒటిటిలో సందడి చేయనుంది. థియేటర్‌లో కేవలం తమిళ భాషలో విడుదలైన ఈ సినిమా ఒటిటిలో మాత్రం తమిళ్‌తో పాటు తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో అందుబాటులోకి రానుంది. ఈ సినిమా ఆగస్టు 8వ తేదీ నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది.

అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేస్తున్న హీరో డైరెక్టర్ అయ్యేందుకు ఏం చేశాడు, అందులో హీరోయిన్‌తో తన ప్రేమ ఏమైంది.. చివరకు సినిమా హ్యాపి ఎండింగ్ అయిందా లేదా అనేదే ఈ సినిమా (Oho Enthan Baby) కథాంశం. ఈ సినిమాలో హీరో అశ్విన్ పాత్రలో రుద్ర నటించాడు. తొలి సినిమా అయినప్పటికీ.. తన నటనతో అందరినీ ఆకట్టుకున్నాడు. హీరోయిన్‌గా మిథిలా పాల్కర్ నటించింది. కృష్ణ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా జూలై 11న థియేటర్‌లో విడుదలై మంచి మార్కులు దక్కించుకుంది. ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌తో ఆగస్టు 8 నుంచి స్ట్రీమింగ్ అవుతున్నట్లు ఆ సంస్థ తెలిపింది. ‘రొమాన్స్ ఉంది, ట్విస్టు ఉంది, డ్రామా ఉంది, హ్యాపీ ఎండింగ్ ఉందా?’ అంటూ సోషల్‌మీడియాలో పోస్టు పెట్టింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News