Friday, July 11, 2025

ఆయిల్ ఫామ్ తోటలతో అధిక లాభాలు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / పెగడపల్లి ః రైతులు తమ పంట పొలాల్లో ఆయిల్ ఫామ్ పంటల సాగు చేసినట్లయితే అధిక దిగుబడితోపాటు అధిక లాభాలు పొందవచ్చునని ఆయిల్ ఫామ్ క్లస్టర్ అధికారి అనిల్ కుమార్ అన్నారు. గురువారం మండల కేంద్రంలోని ఉద్యాన శాఖ, లోహియా ఎడిబుల్ ఆయిల్స్ (గోల్డ్ డ్రాప్) ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఆయిల్ పామ్ సాగుపైన వ్యాన్ క్యాంపెన్ ద్వారా అవగాహన సదస్సు నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయిల్ పామ్ క్లస్టర్ అధికారి అనిల్ కుమార్ మాట్లాడుతూ ఆయిల్ పామ్ సాగువలన అధిక లాభాలతో ఆర్ధిక భద్రత మరియు మెరుగైన సామాజిక స్థితి ఉంటుందని తెలిపారు.

కేంద్ర ప్రభుత్వం ద్వారా మొక్కలకు 90%, డ్రిప్ కు 80-90% రాయితీలు, ఎకరానికి 4200 రూ పెట్టుబడి సహాయం, అలాగే ఫ్యాక్టరీ నిర్మాణం కోసం బుగ్గరం మండలం యశ్వంత్రావుపేట గ్రామంలో సెప్టెంబర్ 4 వ తేదీన భూమి పూజ కార్యక్రమం ఉందని అన్నారు. ఈ పంట సాగుపై ఆసక్తిగల రైతులు దరఖాస్తులు ఇవ్వాలని కోరారు.అనంతరం ఆయిల్ పామ్ సాగు చేసిన రైతులను సన్మానించారు.ఈ కార్యక్రమంలో సింగిల్ విండో సీఈఓ తడకమల్ల గోపాల్ రెడ్డి,ఫీల్డ్ ఆఫీసర్ సాంసన్, ఆయిల్ పామ్ రైతులు కాటం వేణుగోపాల్ రెడ్డి, బొమ్మెన దయాకర్, పలువురు ఇతర రైతులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News