Tuesday, July 15, 2025

అందరి సహకారంతో తెలంగాణ అభివృద్ధి

- Advertisement -
- Advertisement -

ఆయిల్ పామ్ పంటకు కట్టుదిట్టమైన చర్యలు
ఉమ్మడి కరీంనగర్‌ను అగ్రగామిగా నిలపాలి
అందుబాటులో ఎరువులు, విత్తనాలు
ప్రైవేట్‌కు దీటుగా ప్రభుత్వ విద్య అందించాలి
జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
విద్య, వైద్యం, వ్యవసాయానికి ప్రభుత్వ
ప్రాధాన్యత కల్తీ విత్తనాలు అమ్మే వారిపై కఠిన
చర్యలు ఐటి మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు
ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యత పెంచేందుకు
కృషి: మంత్రి పొన్నం ప్రభాకర్

ప్రతి ఒక్కరి సహకారంతో తెలుంగాణను అభివృద్ధిపథంలో ముందుకు తీసుకువెళ్తున్నామని రాష్ట్ర వ్యవసాయ, మా ర్కెటింగ్, సహకార, చేనేత, జౌళి శాఖల మంత్రి, ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఆదివారం కరీంనగర్ కలెక్టరేట్‌లోని ఆడిటోరియం హాల్‌లో ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలో వ్యవసాయ శాఖ, విద్యా శాఖ, హౌసింగ్ తదితర శాఖల పని తీరుపై మంత్రులు పొన్నం ప్రభాకర్, దుద్దిళ్ళ శ్రీధర్ బాబుతో కలిసి ఆయన సమీక్ష నిర్వహించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలో వర్షాభావ పరిస్థితులు, క్రాప్ బుకింగ్, సాగు వివరాలు, విత్తనాలు, ఎరువుల లభ్యత, రైతు భరోసా, ఆయిల్ పామ్ సాగు, ఇందిరమ్మ ఇండ్ల మంజూరు, గ్రౌండింగ్ జరిగిన ఇండ్లు, ప్రభుత్వ పాఠశాలల్లో చేపట్టిన అభివృద్ధి పనులు, బడిబాట, మధ్యాహ్న భోజనం, తదితర అంశాలను ఆయా జిల్లాల వారీగా సంబంధిత కలెక్టర్‌లు వివరించారు.

ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వర రావు మాట్లాడుతూ..గత ఏడాదిన్నర కాలంగా గత పాలకుల హయాంలో అమలు చేసిన సంక్షేమ పథకాలను కొనసాగిస్తూ, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ అమలు చేస్తున్నామని అన్నారు. రాష్ట్రంలో ఉన్న అస్తవ్యస్త పరిస్థితులను సరిచేస్తూ ఆర్థికపరమైన వెసులుబాటు చేసు కొని పాలన సాగిస్తున్నామని అన్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా సమగ్ర అభివృద్ధికి అధికారులు, ప్రజాప్రతినిధులు సంయుక్తంగా పనిచేయాలని అన్నారు. జూలై వరకు అవసరమైన విత్తనాలు, ఎరువుల స్టాక్ అందుబాటులో ఉంచుకోవాలని అన్నారు. యూరియా వాడకం తగ్గించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు తక్కువ సరఫరా చేస్తోందని, అవసరమైన మేర మాత్రమే యూరియా వాడాలని, అధికంగా వాడటం వల్ల భూసారం తగ్గిపోతుందని, భూమికి నష్టం జరుగుతుందని, దీనిపై రైతులకు రెగ్యులర్‌గా అవగాహన కల్పించాలని అన్నారు.

కల్తీ విత్తనాలు అమ్మే వారిపై కఠిన చర్యలు
కల్తీ విత్తనాలు అమ్మే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఐటి , పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు పేర్కొన్నారు. రాబోయే మూడున్నరేళ్ల వ్యవధిలో సాచురేషన్ పద్ధతిలో పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని అన్నారు. రైతులు ప్రత్యామ్నాయ పంటల సాగు దిశగా దృష్టి సారించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. వరికంటే రెండింతల ఆదాయం వచ్చే పంటలను రైతులకు సూచించాలని అన్నారు.
రైతులు పూర్తిస్థాయిలో కాకపోయినా తమకు ఉన్న పొలంలో కొంతమేర వరి నుంచి ఆయిల్ పామ్ వంటి పంటలకు విస్తరించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఒక గుంట భూమి కూడా పడావు పడకుండా వ్యవసాయ సాగు జరగాలని అన్నారు. ఇందిరమ్మ ఇండ్లకు ఉచిత ఇసుక సరఫరా చేస్తున్నామని, పేదలకు మహిళా సంఘాల ద్వారా లక్ష రూపాయల రుణాలు అందించి ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం ప్రారంభమయ్యేలా చూస్తున్నామని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News