Tuesday, September 9, 2025

హైదరాబాద్‌లో రద్దైన పాత కరెన్సీ నోట్లు స్వాధీనం

- Advertisement -
- Advertisement -

నగరంలో రూ.2 కోట్ల విలువైన పెద్దనోట్లు పట్టుబడటం సంచలనం రేపింది. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ నగర పరిధిలోని నారాయణగూడలో టాస్క్‌ఫోర్స్ పోలీసులు సోమవారం తనిఖీలు చేశారు. ఈ సందర్భంలో ఓ ఇంట్లో 3 పెద్ద బ్యాగుల్లో రద్దు అయిన రూ.2 కోట్ల విలువైన రూ.500, రూ.వెయ్యి నోట్ల కట్టలను పోలీసులు గుర్తించారు. ఈ మేరకు బ్యాగులతో పాటు నలుగురు అనుమానిత వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అసలు ఆ నోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి? ఎవరివి, అక్కడ ఎందుకు ఉన్నాయనే విషయాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. అవినీతిపై పోరాడేందుకు, దేశంలో నల్లధనం సమస్యలను రూపు మాపేందుకు 2016 నవంబరు 8 అర్థరాత్రి నుంచి మొదలుకుని రూ.500, రూ.వెయ్యి నోట్లను నరేంద్ర మోడీ ప్రభుత్వం రద్దు చేసిన విషయం విదితమే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News