ఈ ఏడాది కొనసాగిస్తూ ప్రభుత్వం
ఉత్తర్వులు బిటెక్, ఎంటెక్, ఎంసిఎ,
ఎంబిఎ, ఒకేషనల్ కోర్సులకు వర్తింపు
కొన్ని కాలేజీలు తప్పుడు లెక్కలు
సమర్పించినట్టు ఆరోపణలు త్వరలో
నిపుణుల కమిటీ ఏర్పాటు ఇతర
రాష్ట్రాల్లో అమలవుతున్న ఫీజులపై పరిశీలన
మన తెలంగాణ/హైదరాబాద్ : ఇంజినీరింగ్ ఫీజుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణ యం తీసుకుంది. బి.టెక్ కోర్సులకు 2025 -26 విద్యాసంవత్సరానికి పాత ఫీజులనే కొనసాగిస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు సోమవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. బి.టెక్, ఎం.టెక్, బి.ఆర్క్, ఎం.ఆర్క్, బి.ఫార్మసీ, ఎం. ఫార్మసీ, ఫార్మా డి, ఎంబిఎ, ఎంసిఎ, ఎంబిఎ ఇంటిగ్రేటెడ్, బి. ఒకేషనల్ కోర్సులకు తాజా ప్ర భుత్వ నిర్ణయం వర్తించనుంది. ఈ నిర్ణయం తో పేద, మధ్య తరగతి కుటుంబాలపై ఆర్థిక భారం తప్పనుంది. ఇంజినీరింగ్ కోర్సు విద్యార్థులకు ఆర్థిక సాయం కింద ప్రభుత్వం రీయింబర్స్‌మెంట్‌ను
కూడా అందిస్తోంది. ఫీజులపై త్వరలో ని పుణుల కమిటీని ఏర్పాటు చేస్తామని విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా ఉత్తర్వుల్లో వెల్లడించారు. ఇతర రాష్ట్రాల్లో అమలవుతున్న ఫీజులను ఆ కమిటీ పరిశీలిస్తుందని, వాటితోపాటు అన్ని అంశాలను క్షుణ్ణంగా పరిశీలించి సుప్రీం కోర్టు, హైకోర్టుల ఆదేశాల మేరకు ఫీజుల పెంపుపై నిర్ణయం తీసుకోనున్నట్లు పేర్కొన్నారు.
కొన్ని క ళాశాలలు అధ్యాపకులకు ఎక్కువ మొత్తంలో వే తనాలు ఇచ్చినట్లు, నిర్వహణ పనులకు అధికం గా ఖర్చు చేసినట్లు తెలంగాణ అడ్మిషన్స్ అండ్ ఫీజు రెగ్యులేటరీ కమిటి(టిఎఎఫ్‌ఆర్‌సి)కి తప్పు డు లె క్కలు సమర్పించాయన్న ఆరోపణలు పెద్ద ఎత్తున ఉన్నాయి. ఫీజులపై హేతుబద్దమైన నిర్ణ యం తీసుకోవాలని భావించిన ప్రభుత్వం కళాశాలల్లో బోధన, బోధనేతర సిబ్బంది, ల్యా బ్‌లు, భవనాలు, బోధన ప్రమాణాలు, ఇతర వసతుల వంటి అంశాలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతనే ఈ ఏడాది పాత ఫీజులను కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో తాజాగా ఇంజినీరింగ్ కోర్సులకు ఫీజుల పెంపు లేదని ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. మరోవైపు పాలిటెక్నిక్ డిప్లొమా పూర్తి చేసిన విద్యార్థులు ఇసెట్ ద్వారా నేరుగా బి.టెక్, బి.ఫార్మసీ ద్వితీయ సంవత్సరంలో కోర్సులో చేరనున్నారు. దీంతో ఇంజనీరింగ్ రెండో ఏడాదిలో ప్రవేశాలు పొందుతున్న విద్యార్థులకు కూడా తాజా నిర్ణయం ప్రకారం పాతన ఫీజులే వర్తించనున్నాయి.
కౌన్సెలింగ్ నిర్వహణ
రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలల్లో ఇంజనీరింగ్ ప్రవేశాల నిర్వహించే తొలి విడత కౌన్సెలింగ్ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభం కాగా, మంగళవారం(జులై 1) నుంచి సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రారంభం కానుంది. ఇంజనీరింగ్ కౌన్సెలింగ్‌లో సోమవారం సాయంత్రం వరకు 64,190 మంది విద్యార్థులు స్లాట్ బుకింగ్ చేసుకున్నారు. ఈనెల 7వ తేదీ వరకు అర్హులైన విద్యార్థులు ఆన్‌లైన్‌లో స్లాట్ బుకింగ్ చేసుకునేందుకు అవకాశం ఉంది. స్లాట్ బుకింగ్ ఆధారంగా ఈ నెల 8 వరకు సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు హాజరు కావాల్సి ఉంటుంది. ఈనెల 6 నుంచి 10వ తేదీ వరకు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చు. ఈ నెల 18వ తేదీన సీట్ల కేటాయింపు జరగనుంది. అంతకుముందు ఈసారి కొత్తగా జోసా తరహాలో నెల 13వ తేదీన మాక్ సీట్ కేటాయింపు చేయనున్నారు. అనంతరం ఈ నెల 14, 15 తేదీలలో అవసరమైతే వెబ్ ఆప్షన్లు మార్చుకునేందుకు అవకాశం కల్పించారు. ఈసారి మొత్తం మూడు విడతల్లో ఈ ప్రక్రియ కొనసాగనుంది.