ఇంటి ఆవరణలో ఉన్న ఇంకుడు గుంతలో పడి చిన్నారి మృతి చెందింది. ఈ విషాద ఘటన ఖమ్మం జిల్లా, సత్తుపల్లి మండలం, సత్యంపేట గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..సత్తుపల్లి మండలం, రుద్రాక్షపల్లి పంచాయతీ పరిధిలోని సత్యంపేట గ్రామంలో సోయం శివ,సంధ్యారాణి దంపతుల కుమార్తె మోక్ష దుర్గ (1) ఇంటి ఆవరణలో ఉన్న ఇంకుడు గుంత పై మూత లేకపోవడంతో నడుచుకుంటూ వెళ్లి అందులో పడిపోయింది. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులు గమనించకపోవడంతో కొద్దిసేపటికి ఆ చిన్నారి మృతి చెందింది. విషయం తెలిసిన సత్తుపల్లి ఎంఎల్‌ఎ డాక్టర్ మట్టా రాగమయి దయానంద్, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు దయానంద్, విజయకుమార్ సత్యంపేటకు చేరుకొని బాధిత కుటుంబ సభ్యులను ఓదార్చారు. చిన్నారి మృతికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. కాగా, సోయం శివ, సంధ్యారాణికి మొదటి సంతానం బాబు జన్మించగా రెండో సంతానం మోక్ష దుర్గ జన్మించింది. చిన్నారి మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
ఇంకుడు గుంతలో పడి చిన్నారి మృతి
- Advertisement -
- Advertisement -
- Advertisement -