Sunday, June 15, 2025

వన్‌ప్లస్ 13ఎస్ వచ్చేసింది..రూ. 5000 బ్యాంక్ డిస్కౌంట్..

- Advertisement -
- Advertisement -

ప్రముఖ ఫోన్ల తయారీ కంపెనీ వన్‌ప్లస్ మొదటి అత్యంత కాంపాక్ట్, శక్తివంతమైన స్మార్ట్‌ఫోన్ ను విడుదల చేసింది. కంపెనీ వన్‌ప్లస్ 13ఎస్ పేరిట తీసుకువచ్చింది. అనేక ఫీచర్ల తో కంపెనీ ఈ ఫోన్ ను మార్కెట్లో విడుదల చేసింది. ఇప్పుడు వన్‌ప్లస్ 13ఎస్ ధర, ఆఫర్‌ల, ఫీచర్ల గురించి తెలుసుకుందాం…

వన్‌ప్లస్ 13ఎస్ ను పింక్ శాటిన్, బ్లాక్ వెల్వెట్, గ్రీన్ సిల్క్ రంగులలో కొనుగోలు చేయవచ్చు. వన్‌ప్లస్ 13ఎస్ 12GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 54,999గా, 12GB RAM + 512GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 59999గా కంపెనీ నిర్ణయించింది. ఇక ఆఫర్ల గురించి మాట్లాడితే.. SBI క్రెడిట్ కార్డ్ వినియోగదారులు ఈ ఫోన్‌పై రూ. 5000 తగ్గింపు పొందుతారు. దీనితో పాటు కార్డుపై 9 నెలల నో-కాస్ట్ EMIని కూడా పొందవచ్చు. పాత ఫోన్‌ను మార్చుకున్నా రూ. 5000 ఎక్స్ఛేంజ్ బోనస్ లభిస్తుంది.

వన్‌ప్లస్ 13ఎస్ ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.32-అంగుళాల AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. పనితీరు పరంగా.. ఈ ఫోన్‌లో స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ఆక్టా-కోర్ ప్రాసెసర్ ఉంది. ఇది 5,850mAh బ్యాటరీ ప్యాక్‌ను కలిగి ఉంది. 80W ఫాస్ట్ ఛార్జింగ్‌తో అందుబాటులో ఉంది. ఈ ఫోన్ ఆక్సిజన్ OS 15.0 ఆధారిత Android 15లో పనిచేస్తుంది. ఈ ఫోన్ వెనుక భాగంలో 50MP + 50MP డ్యూయల్ రియర్ కెమెరాలు ఉన్నాయి. సెల్ఫీల కోసం.. ఫోన్ 16MP ఫ్రంట్ కెమెరాను అమర్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News