టన్నుకు రూ.400 మాత్రమే బుక్ చేసిన 48 గంటల్లో సరఫరా
ఒఆర్‌ఆర్‌పై నాలుగు ఇసుక బజార్లు, త్వరలో మరో రెండు
అందుబాటులోకి సిఎం రేవంత్ ఆదేశాలతో పారదర్శకంగా
విక్రయాలు టిజిఎండిసి చైర్మన్, ఎండి వెల్లడి
మన తెలంగాణ/హైదరాబాద్: ప్రజల కు ఇబ్బందులు కలగకుండా, ఇసుక బ్లా క్ మార్కెట్ తరలకుండా ఇంటికే ఇసుకను సరఫరా చేయాలని నిర్ణయించామ ని టిజిఎండిసి చైర్మన్ అనిల్ ఈరవత్రి, ఎండి సుశీల్‌కుమార్‌లు పేర్కొన్నారు. బుధవారం ఖైరతాబాద్‌లోని టిజిఎండిసి కార్యాలయంలో టిజిఎండిసి అనిల్, ఎండి సుశీల్‌కుమార్‌లు విలేకరుల స మావేశం నిర్వహించారు. ఈ సందర్భం గా చైర్మన్ అనిల్ ఈరవత్రి మాట్లాడు తూ ప్రస్తుతం 24 రీచ్‌ల నుంచి ఇసుక ను సరఫరా చేయాలని నిర్ణయించామని ఆయన తెలిపారు. ఈ ఇసుక కావాలనుకునే వినియోగదారులు టిజిఎండిసి వె బ్‌సైట్ ద్వారా బుకింగ్ చేసుకోవాలని రీచ్ దూరం ఆధారంగా వాహనానికి అద్దెను చెల్లించాల్సి ఉంటుందని, దీంతోపాటు టన్ను ఇసుకకు రూ.400లు చె ల్లించాలని ఆయన తెలిపారు. ఇసుకను బుక్ చేసుకున్న తరువాత 48 గంటల్లో గా ఈ ఇసుక బుకింగ్ చేసుకున్న వారి ఇంటికి లారీల్లో పంపిస్తామని ఆయన తెలిపారు. దీనివల్ల ఇసుక ధరలు పెరగకుండా దళారులకు అడ్డుకట్ట వేస్తున్నామని ఆయన పేర్కొన్నారు.
గతంలో రూ. 7వేల కోట్ల దోపిడీ
గత ప్రభుత్వం 2023 24 ఆర్థిక సంవత్సరంలో టిజిఎండిసికి ఇసుక ద్వారా రూ.673 కోట్ల ఆదాయం వస్తే, ఈ ఆర్థి క సంవత్సరంలో రూ.748 కోట్ల ఆదా యం వచ్చిందని సుమారుగా రూ.80 కోట్ల పైచిలుకు ఆదాయం అధికంగా వచ్చిందని ఆయన తెలిపారు. రానున్న ఆర్థిక సంవత్సరంలో రూ.1200 కోట్ల ను టార్గెట్‌గా పెట్టుకున్నామని ఆయన పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో సుమారుగా 50కి పైగా రీచ్‌లను నడిపి రూ. 673 కోట్ల ఆదాయాన్ని అప్పటి ప్రభు త్వం రాబడితే తమ ప్రభుత్వం వచ్చిన త రువాత సుమారుగా 25 రీచ్‌ల ద్వారానే తాము ఈ ఆదాయాన్ని రాబట్టామని ఆ యన తెలిపారు. గత ప్రభుత్వంలో ఇ సుక ద్వారా సుమారుగా రూ.7 వేల కో ట్లను దోచుకున్నారని ఆయన ఆరోపించారు. గత ప్రభుత్వంలో టన్ను ఇసుక ను సుమారుగా రూ.2500ల వరకు వి క్రయించి పేదలను దోచుకున్నారని ఆ యన ఆగ్రహ వ్యక్తం చేశారు.
సిఎం రేవంత్‌రెడ్డి సారథ్యంలో టిజిఎండిసిలో అనేక సంస్కరణలకు శ్రీకారం చుట్టామని ఆయన తెలిపారు. లారీలకు జిపిఎస్ ట్రాకింగ్ సిస్టంలను సైతం తీసుకొచ్చామని, ప్రతి రీచ్‌ల దగ్గర సిసి కెమెరాలను ఏర్పాటు చేశామని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం తమ సంస్థ ఆధ్వర్యంలో, సిఎ సలహాలు, సూచనల మేరకు ఓఆర్‌ఆర్‌కు ఇరువైపులా నాలుగు ఇసుక బజార్‌లను అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. అక్కడ ఇసుకను కొనాలంటే దొడ్డు ఇసుకకు రూ.1600లు, సన్న ఇసుకకు రూ.1800 లు చెల్లించాల్సి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. రానున్న రోజుల్లో మరో రెండు ఇ సుక బజార్‌లను అందుబాటులోకి తీసుకొస్తామని ఆయన పేర్కొన్నారు.