Friday, August 1, 2025

రొమాంటిక్‌గా ’ఊపిరి ఊయలలాగా…’

- Advertisement -
- Advertisement -

యష్ రాజ్ ఫిలిమ్స్ నిర్మించిన ’వార్ 2’ నుంచి మొదటి ట్రాక్ విడుదలైంది. సూపర్ స్టార్స్ అయిన హృతిక్ రోషన్, కియారా అద్వానీలపై తీసిన ఈ రొమాంటిక్ పాట ‘ఊపిరి ఊయలలాగా’ ఇప్పుడు సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. ‘బ్రహ్మాస్త్ర‘లోని బ్లాక్‌బస్టర్ పాట ’కేసరియా’ పాటని కంపోజ్ చేసిన టీం ఈ రొమాంటిక్ సాంగ్‌ను రూపొందించారు. హిందీలో ఈ పాటకు ప్రీతమ్ బాణీ, అమితాబ్ భట్టాచార్య లిరిక్స్, అరిజిత్ సింగ్ గాత్రాన్ని అందించారు. ఇక తెలుగులో ఈ పాటకు చంద్రబోస్ సాహిత్యం అందించారు. తెలుగులో ఈ పాటను శాశ్వత్ సింగ్, నిఖితా గాంధీ ఆలపించారు. హృతిక్, కియారా మధ్య బ్యూటీఫుల్ కెమిస్ట్రీ, పాటను తెరకెక్కించిన విధానం, లోకేషన్స్ అన్నీ కూడా అధ్భుతంగా ఉన్నాయి. కియారా పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేసిన ఈ పాట అందరినీ ఆకట్టుకునేలా ఉంది. ఆదిత్య చోప్రా నిర్మించిన ‘వార్ 2‘ ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా హిందీ, తెలుగు, తమిళ భాషలలో విడుదల కానుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News