- Advertisement -
కుల్గాం: జమ్ముకాశ్మీర్ లోని కుల్గాం జిల్లాలో ముగ్గురు ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. జిల్లాలోని దేవ్‌సర్ ఏరియాలోని అఖల్ అటవీ ప్రాంతంలో జరిగిన భీకర ఎన్‌కౌంటర్‌లో భద్రతా దళాలు ముగ్గురు ఉగ్రవాదులను హతమార్చాయని అధికారులు శనివారం వెల్లడించారు. దట్టమైన అటవీ ప్రాంతంలో ఉగ్రవాదుల కదలిక గురించి పక్కా నిఘా సమాచారం ఆధారంగా.. శుక్రవారం సాయంత్రం భారత సైన్యం, సిఆర్‌పిఎఫ్, జమ్మూ కాశ్మీర్ పోలీసులు ఆపరేషన్ అఖల్ ను ప్రారంభించింది. నిన్న రాత్రి నుంచి ఉగ్రవాదుల కోసం భద్రతా బలగాలు ఆపరేషన్ ను ముమ్మరంగా కొనసాగించాయి. ఈ క్రమంలో శనివారం తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో దాదాపు 20 నిమిషాల పాటు ఇరు వర్గాల మధ్య భీకర కాల్పులు జరిగాయి. ఈ భారీ కాల్పుల్లో ముగ్గురు టెర్రరిస్టులు మృతి చెందారు. ప్రస్తుతం ఈ ఆపరేషన్ కొనసాగుతుందని అధికారులు తెలిపారు.
- Advertisement -