Thursday, May 8, 2025

ఆపరేషన్ సింధూర్ సక్సెస్… దేశ వ్యాప్తంగా సంబురాలు

- Advertisement -
- Advertisement -

శ్రీనగర్: పహల్గమ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్తాన్ తీవ్రవాదులు స్థావరాలను లక్ష్యంగా చేసుకొని భారత వాయు సైన్యం బాంబులతో దాడి చేసింది. ఆపరేషన్ సింధూర్ పేరుతో పాక్ తీవ్రవాదుల అడ్డాలపై దాడులు చేయడంతో వంద మంది ఉగ్రవాదులు చనిపోయినట్టు సమాచారం. పాక్ ఉగ్రవాదుల స్థావరాలపై భారత సైన్యం దాడి చేయడంతో యావత్ దేశం వ్యాప్తంగా సంబురాలు చేసుకుంటుంది. రాజస్థాన్, జమ్ము కశ్మీర్, పంజాబ్ రాష్ట్రాలలో స్థానికులు పటాసులు పేలువడంతో భారత్ మాతా కీ జై, జైహిందూ అంటూ సంబురాలు చేసుకున్నారు. ఎల్‌ఒసి వెంట కాల్పుల మోత మోగుతుండడంతో సరిహద్దు గ్రామాల ప్రజల భయంతో వణికిపోతున్నారు. పాక్, భారత్ సైనికులు సరిహద్దుల వెంట కాల్పులకు తెగపడుతుండడంతో ఎల్‌ఒపిలో ఉన్న గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. పాక్, భారత సైనికుల మధ్య భీకర పోరు కొనసాగుతోంది. ఈ కాల్పుల్లో ఇప్పటి వరకు ఎనిమిది మంది దుర్మరణం చెందారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News