ఇంటలిజెన్స్ సెంటర్ ఆరంభంలో అమిత్ షా
ప్రధాని మోడీ రాజకీయ స్థిరత్వం
తిరుగులేని సమాచార సేకరణం
అజేయ స్థాయి సైనిక పాటవం
న్యూఢిల్లీ : ఇటీవలి ఆపరేషన్ సిందూర భారతదేశపు త్రివిధ శక్తి సంపన్నతను ప్రపంచానికి చాటి చెప్పిందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా చెప్పారు. ప్రధాని మోడీ స్థిరమైన రాజకీయ సంకల్పం, మరోవైపు పలు కీలక సంస్థల నిర్థిష్ట ఇంటలిజెన్స్ సమాచార క్రోడీకరణ, దేశ సాయుధ బలగాల పోరాట పటిమ, ఈ మూడు అంశాలు భారత్ అంటే ఏమిటీ ? మన శక్తి ఏ పాటిది? అనే కీలక విషయాలను వెల్లడించిందని వివరించారు.
దేశ రాజధానిలో శుక్రవారం అధునాతన మల్టి ఏజెన్సీ సెంటర్ ప్రారంభం తరువాతి సభలో ఆయన మాట్లాడారు. ఎప్పటికప్పుడు ఇంటలిజెన్స్ సమాచార సేకరణ , పలు సంస్థల మధ్య పంపిణీ, సముచిత సమన్వయం నిర్వహణకు ఈ కీలక కేంద్రం ఏర్పాటు జరిగింది. ఓ ధృఢమైన నాయకత్వం, గురి తప్పని సమాచార సేకరణ, నిరుపమాన దాడుల శక్తియుక్తులు ఇప్పుడు దేశాన్ని మరింత శక్తివంతం చేశాయని అమిత్ షా ఈ సందర్భంగా తెలిపారు. పహల్గాం ఉగ్రదాడి తరువాత చోటుచేసుకున్న మన అత్యంత కీలకమైన ఆపరేషన్ సిదూర ప్రధాని మోడీ చెక్కుచెదరని రాజకీయ చిత్తశుద్ధికి, మొక్కవోని ధక్షతకు నిదర్శనం అయిందని పేర్కొన్నారు.
ఇక్కడ ప్రారంభం అయిన మల్టీ ఏజెన్సీ సెంటర్ దేశ ఇంటలిజెన్స్ బ్యూరో పరిధిలో పనిచేస్తుంది. 26/11 ముంబై దాడుల తరువాతి క్రమంలో దేశంలో పలు స్థాయిల నిఘా సమాచార వ్యవస్థల మధ్య సత్వర సమగ్ర రీతి సమన్వయానికి ఈ మల్టీ ఏజెన్సీ సెంటర్ ఏర్పాటు జరిగింది. సకాలంలో సమాచారం సేకరించడం తరువాతి క్రమంలో పలు సంస్థల సమన్వయంతో తీసుకోవల్సిన చర్యల గురించి ఆలోచించి తాత్సారం లేకుండా స్పందించడం ఈ ఏజెన్సీ ముఖ్య ఉద్ధేశం