Wednesday, May 14, 2025

విజయవంతంగా ఆపరేషన్ సిందూర్

- Advertisement -
- Advertisement -

70 దేశాలకు భారత ఆర్మీ వివరణ

న్యూఢిల్లీ: పాకిస్తాన్ లోనూ, పాక్ ఆక్రమిత కశ్మీర్ లోనూ టెర్రరిస్ట్ శిబిరాలపై విజయవంతంగానిర్వహించిన ఆపరేషన్ సిందూర్ పై భారత సైన్యం దాదాపు 70 దేశాల సైనికాధికారులకు వివరించింది. ఆ ఆపరేషన్ వల్ల ఉభయదేశాల సంబంధాలపై పడిన ప్రభావాన్ని కూడా వివరించింది. ఢిల్లీ కంటోన్మెంట్ లో మానెక్ షా సెంటర్ లో జరిగిన కార్యక్రమంలో డిఫెన్స్ ఇంటిలిజెన్స్ ఏజెన్సీ డైరెక్టర్ జనరల్ లెఫ్టినెంట్ జనరల్ డిఎస్ రాణా ఆధ్వర్యంలో అధికారులు వివరణ ఇచ్చారు. దాదాపు 30 నిముషాల పాటు ఈ బ్రీఫింగ్ జరిగింది. ఆపరేషన్ సిందూర్ కు సంబంధించి తప్పుడు ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈ వివరణ వచ్చింది. స్విడన్, నేపాల్, ఫిలిఫైన్స్, ఈజిప్ట్ సహా ప్రపంచ పలు దేశాల సైనిక ప్రతినిధులు, ఇస్లామిక్ దేశాల ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News