Friday, May 16, 2025

‘ఆపరేషన్ సింధూర్’ ద్వారా నయా భారత్ అంటే ఏంటో తెలిసింది: రాజ్‌నాథ్

- Advertisement -
- Advertisement -

భుజ్‌: గుజరాత్‌లోని భుజ్ వైమానిక స్థావరాన్ని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్(Rajnath Singh) సందర్శించారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత ఆయన తొలిసారిగా అక్కడకు వెళ్లారు. అక్కడ ఆర్మీ, వాయుసేన, బీఎస్ఎఫ్ సిబ్బందితో రాజ్‌నాథ్ ముచ్చటించారు. ఈ పర్యటనలో రాజ్‌నాథ్‌తో పాటు ఎయిర్‌ఫోర్స్ చీఫ్ ఎ.పి. సింగ్ ఉన్నారు. ఆపరేషన్ సింధూర్‌లో(Operation Sindoor) వాయుసేన ప్రధానపాత్ర వహించిందని ఆయన అన్నారు. ఎయిర్‌ఫోర్స్ ఎంతో ధైర్యం పరాక్రమం ప్రదర్శించిందని కొనియాడారు. కేవలం 23 నిమిషాల్లోనే ఉగ్రస్థావరాలను ధ్వంసం చేశామని పేర్కొన్నారు. ప్రధాని మోదీ నాయకత్వం ఉగ్రవాదులకు నూతన సందేశం ఇచ్చిందని తెలిపారు.

భారత వాయుసేన స్థావరాలను పాక్ డ్రోన్లు ఏమీ చేయలేకపోయాయని.. బ్రహ్మోస్ క్షిపణి సత్తాకు పాక్ తలవంచక తప్పలేదని అన్నారు. ‘‘మన అత్యాధునిక ఆయుధాలు అన్‌స్టాపబుల్‌గా దూసుకెళ్లాయి. ఆపరేషన్ సింధూర్‌తో(Operation Sindoor) మన సత్తా ప్రపంచమంతా చూసింది. పాకిస్థాన్‌కు ఆర్థికసాయం చేస్తే ఉగ్రవాదులకు చేసినట్లే. పాక్‌కు ఆర్థికసాయంపై ఐఎంఎఫ్ పునరాలోచించుకోవాలి. ఉగ్రవాదులకు పాక్ సాయం చేస్తూ ప్రపంచానికి ముప్పు కలిగిస్తోంది. శాంతికి విఘాతం కలిగిస్తే ఉపేక్షించమని ఆపరేషన్ సింధూర్ ద్వారా నిరూపించాం. పాక్‌లోని ఏ ప్రాంతపైనైనా దాడి చేయగల సామర్థ్యం భారత్‌కు ఉంది. ఆపరేషన్ సింధూర్ ద్వారా ‘నయా భారత్’ అంటే ఏంటని ప్రపంచానికి తెలిసింది’’ అని రాజ్‌నాథ్(Rajnath Singh) స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News