- Advertisement -
ఈ నెల చివర్లో దేశీయ మార్కెట్లోకి ఒప్పొ కె13ఎక్స్ 5జి మోడల్ రానుంది. ఈ ఫోన్ 23న మధ్యాహ్నం 12 గంటలకు భారతదేశంలో లాంచ్ అవుతుందని కంపెనీ ప్రకటించింది. దీని ధర దేశంలో రూ. 15,000 కంటే తక్కువగా ఉంటుందని కంపెనీ తెలిపింది. ఈ ఫోన్ మిడ్నైట్ వైలెట్, సన్‌సెట్ పీచ్ కలర్ ఆప్షన్లలో ప్రత్యేకంగా ఫ్లిప్‌కార్ట్ ద్వారా అందుబాటులో ఉంటుంది. రాబోయే బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ కీలక స్పెసిఫికేషన్లను వెల్లడించింది. ఇది రూ. 15,000 లోపు ధర విభాగంలో ఉంటుంది. 4జిబి, 6జిబి ర్యామ్ వేరియంట్లలో అందుబాటులో ఉంది. ఒప్పొ కె13ఎక్స్ 5జి శ్రేణిలో అత్యంత నిర్మాణ నాణ్యతను అందిస్తోంది. ఎస్జిఎస్ గోల్డ్ డ్రాప్-రెసిస్టెన్స్, ఎస్జిఎస్ మిలిటరీ స్టాండర్డ్, ఎంఐఎల్ఎస్టిడి 810హెచ్ డ్యూరబిలిటీ సర్టిఫికేషన్లతో పాటు ఐపి65 రేటింగ్‌ను కలిగి ఉందని ఒప్పొ పేర్కొంది.
- Advertisement -