Friday, September 12, 2025

సింగరేణి సంస్థకు కొత్త బొగ్గు బ్లాక్ లు దక్కని పరిస్థితి : భట్టి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: కీలక ఖనిజాల వెలికితీతలో కూడా కేంద్రం సింగరేణి సంస్థకు అవకాశం కల్పించాలని డిప్యూటి సిఎం భట్టి విక్రమార్క తెలిపారు. గ్రీన్ ఎనర్జీలో కూడా సింగరేణి సంస్థ ప్రవేశించిందని, రాగి, బంగారం మైనింగ్ ఏ సంస్థ చేసినా.. సింగరేణికి 37.75 శాతం వాటా దక్కుతుందని అన్నారు. ఈ సందర్భంగా సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాయచూర్, దేవదుర్గ్ బెల్ట్ లో రాగి, బంగారం ఖనిజాల అన్వేషణలో, కర్ణాటకలో రాగి, బంగారం, మైనింగ్ గనుల తవ్వకాల వేలంలో సింగరేణి సంస్థ పాల్గొన్నదని భట్టి తెలియజేశారు. కీలక ఖనిజాల తవ్వకాల కోసం సింగరేణి గ్లోబల్ అనే పేరుతో వెళ్తుందని, దేశంలో జరుగుతున్న బొగ్గు గనుల వేలంతో కొన్నాళ్లుగా సింగరేణి పాల్గొనడం లేదని చెప్పారు.

సింగరేణి సంస్థ వేలంలో ఎందుకు పాల్గొనడం లేదో తాము పరిశీలించామని అన్నారు. సింగరేణి సంస్థ వేలంలో పాల్గొనకపోతే బొగ్గు బ్లాక్ లు ప్రైవేటు వ్యక్తులకు వెళ్తాయని, సింగరేణి సంస్థకు అదనంగా రావాల్సిన బొగ్గు బ్లాక్ లు దక్కడం లేదని ఆవేదనను వ్యక్తం చేశారు. కొత్త బ్లాక్ లు కేటాయించకపోవడంతో సింగరేణి సంస్థ ఇబ్బందులు ఎదుర్కొంటోందని పేర్కొన్నారు. సింగరేణి సంస్థకు కొత్త బొగ్గు బ్లాక్ లు దక్కని పరిస్థితి వస్తోందని, కొత్త బ్లాక్ లు రాకుంటే సింగరేణి మూసి వేయాల్సిన పరిస్థితి వస్తుందని అన్నారు. సింగరేణికి కొత్త బ్లాక్ లు రాకపోవడంతో ఆ సంస్థతో పాటు రాష్ట్రానికి నష్టం అని హెచ్చరించారు. వేలం ద్వారా పొందే రాయల్టీ ఆ రాష్ట్రాలకే చెందుతుందని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు.

Also Read : గ్రూప్-1 పరీక్ష అవకతవకలపై బిజెపి కిమ్మనడంలేదు: కెటిఆర్

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News