- Advertisement -
న్యూఢిల్లీ: తమ ఉప రాష్ట్రపతి (Vice President) అభ్యర్థిని విపక్ష పార్టీలు ప్రకటించాయి. సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ బి.సుదర్శన్ రెడ్డిని తమ ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేశాయి. జస్టిస్ బి.సుదర్శన్ రెడ్డి స్వస్థలం తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా ఆకులమైలారం. 1971లో ఉస్మానియా వర్సిటీలో బి.సుదర్శన్ రెడ్డి లా చదివారు. 2007-11 మధ్య ఆయన సుప్రీం కోర్టు జడ్జిగా పని చేశారు. గోవా తొలి లోకాయుక్తగా ఆయన సేవలందించారు. 2005లో గువాహటి హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా పని చేశారు. ఇప్పటికే ఎన్డిఎ ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా సి.పి. రాధాకృష్ణన్‌ను ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో రాధాకృష్ణన్, సుదర్శన్ రెడ్డిల మధ్య ఉప రాష్ట్రపతి పదవి కోసం సెప్టెంబర్ 9న పోటీ జరగనుంది.
- Advertisement -