Monday, May 5, 2025

ఔటర్ రింగ్ రోడ్డుపై ప్రమాదం: ఇద్దరు మృతి

- Advertisement -
- Advertisement -

కీసర: మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా కీసరలో ఔటర్ రింగ్ రోడ్డుపై రోడ్డు ప్రమాదం జరిగింది. కంటైనర్‌ను వెనుక నుంచి కారు ఢీకొట్టడంతో ఇద్దరు యువకులు ఘటనా స్థలంలోనే చనిపోయారు. ఈ ప్రమాదంలో మరో నలుగురు తీవ్రంగా గాయపడడంతో ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను శవ పరీక్ష నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. మృతులు మేడిపల్లికి చెందిన యశ్వంత్(25), బోడుప్పల్‌కు చెందిన చార్లెస్(25) అని పోలీసులు వెల్లడించారు. బీదర్‌కు వెళ్లి హైదరాబాద్‌కు వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News