Thursday, July 31, 2025

ఐదు నెలల జీతాల కోసం ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల నిరసన

- Advertisement -
- Advertisement -

నీటిపారుదల శాఖలో తమకు ఐదు నెలలుగా జీతాలు చెల్లించడంలేదంటూ ఔట్ సోర్సింగ్ సిబ్బంది బుధవారం ఆకస్మికంగా నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎర్రమంజిల్ జలసౌధ కార్యాలయం ముందు జరిగిన నిరసన కార్యక్రమానికి తెలంగాణ ఔట్ సోర్సింగ్ జెఎసి కమిటి అధ్యక్షుడు పులి లక్ష్మయ్య, వర్కింగ్ ప్రెసిడెంట్ రాజ్ మహ్మద్‌లు నాయకత్వం వహించారు. కొత్త ఆర్ధిక సంవత్సరం, కొత్త విద్యాసంవత్సరం ప్రారంభమైనప్పటికి గత ఐదు నెలలుగా ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు కనీసం వేతనాలు చెల్లించకపోవడం ఎంతో విచారకరమన్నారు. నామమాత్రపు జీతాలతో కుటుంబాలను పోషించుకుంటున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోకపోవడం శోచనీయమన్నారు.

నెలనెలా వారి కుటుంబ సభ్యుల ఖర్చులు, ఇంటి అద్దె, పిల్లల పాఠశాలల ఫీజులు వంటి అనేకమైన సమస్యలు తమను వెంటాడుతున్నాయని తెలిపారు. జొమాటో, స్విగ్గి లాంటి సిబ్బంది పట్ల ఉన్న చిత్తశుద్ధి ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే ఔట్ సోర్సింగ్ సిబ్బంది పట్ల ప్రభుత్వం కనికరం చూపించకపోవడం అన్యాయమని తెలిపారు. కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ సిబ్బందిని తొలగించాలనే యోచనను ప్రభుత్వం వెంటనే మానుకోవాలని వారు హితవు పలికారు. వెంటనే ఔట్ సోర్సింగ్ సిబ్బంది పెండింగ్ జీతాలు చెల్లించి వారిని ఆదుకోవాలని ప్రభుత్వానికి వారు విజ్ఞప్తి చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News