- Advertisement -
పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (POK)లో భారత సాయుధ దళాలు ఆపరేషన్ సిందూర్ పేరిట క్షిపణి దాడులు చేసి ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేశాయి. ఈ దాడుల తర్వాత ముందస్తు జాగ్రత్తగా దేశవ్యాప్తంగా బుధవారం 200కి పైగా విమానాలను రద్దు చేశారు. శ్రీనగర్, లేహ్, అమృత్‌సర్, చండీగఢ్ సహా 18 విమానాశ్రయాలు తాత్కాలికంగా మూసివేశారు. భద్రతా కారణాల రీత్యా విమానాల రాకపోకలు రద్దు చేసినట్లు అధికారులు వెల్లడించారు.
కాగా, భారత సాయుధ దళాలు.. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్‌లోని బహవల్‌పూర్‌లోని జైష్-ఎ-మొహమ్మద్ ప్రధాన స్థావరంతోపాటు మురిడ్కేలోని లష్కరే-ఎ-తోయిబా వంటి తొమ్మిది ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకుని మిస్సైల్స్ తో విరుచుకుపడ్డాయి. భారత ఆర్మీ దాడుల్లో భారీగా ఉగ్రవాదులు మరణించినట్లు సమాచారం.
- Advertisement -