Wednesday, July 9, 2025

సాయంత్రం వరకు చంపేస్తాం..!

- Advertisement -
- Advertisement -

మెదక్ ఎంపి రఘునందన్‌రావుకు బెదిరింపు ఫోన్ కాల్ రావడంతో ఆయన మెదక్ ఎస్‌పితో పాటు, సంగారెడ్డి ఎస్‌పికి ఫిర్యాదు చేశారు. మేడ్చల్ జిల్లా, దమ్మాయిగూడలో ఒక ప్రయివేట్ పాఠశాల కార్యక్రమంలో సోమవారం ఆయన పాల్గొన్నారు. వేదిక ఎక్కే సమయంలో ఒకసారి, ఆ తర్వాత మరోసారి ఫోన్ రావడంతో సహాయకుడు ఈ విషయాన్ని ఆయనకు చెప్పడంతో వెంటనే ఆయన మాట్లాడారు. తన ఫోన్‌లో రికార్డు ఆప్షన్ లేకపోవడంతో, సహాయకుని ఫోన్ ద్వారా అవతలి వ్యక్తి మాటలను రికార్డు చేయించారు. సాయంత్రం లోగా చంపి వేస్తామని, తాము మావోయిస్టులమని, మధ్యప్రదేశ్ నుంచి మాట్లాడుతున్నామని అవతలి వ్యక్తి అన్నాడు. దీంతో ఎంపి ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్నారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న మెదక్ ఎస్‌పికి ఈ విషయంపై ఫిర్యాదు చేశారు.

అంతేకాకుండా సంగారెడ్డి ఎస్‌పికి కూడా ఈ విషయం గురించి తెలిపారు. తాము దీనిపై విచారణ జరుపుతామని, జాగ్రత్తగా ఉండాలని ఎస్‌పిలు ఎంపితో అన్నట్టు తెలిసింది. ఇదిలాఉంటే, తమ ఎంపికి బెదిరింపు ఫోన్ కాల్ రావడంపై రఘునందన్ అభిమానులు, బిజెపి శ్రేణులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఈ బెదిరింపు కాల్ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఫోన్ నంబర్ లేకుండా, ఆన్‌లైన్ ఫోన్ కాల్ కావడంతో…సాంకేతికత ద్వారా పోలీస్‌లు విచారణ జరుపుతున్నారు. ఫోన్ ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరు చేశారు? నిజమైనా ఫోన్ కాలేనా?లేకుంటే ఫేక్ కాల్‌నా? అనే అంశాలపై దృష్టి సారించారు. ఎంపిగా రఘునందన్ ఎన్నికయిన తర్వాత జిల్లాలో అనేక విషయాలపై దృష్టి సారించారు. పార్లమెంట్ సమావేశాల్లో అవకాశం వచ్చినప్పుడు మాట్లాడుతున్నారు. పార్లమెంట్ బయట కూడా అనేక వేదికలపై తన గళం విప్పుతున్నారు. కేంద్రంలోని తమ ప్రభుత్వ గొప్పతనాన్ని చాటిచెబుతూనే, కేంద్ర నిధుల వినియోగంపై అధికారులను ప్రశ్నిస్తున్నారు. మంచి వాగ్ధాటితో విమర్శకుల నోళ్లు మూయిస్తున్నారు. ఈ కారణంగా ఎవరైనా గిట్టని వ్యక్తులు బెదిరింపు కాల్స్ చేస్తున్నారా? అనే విషయంపై పోలీస్ వర్గాలు ఆరా తీస్తున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News