మన తెలంగాణ/కృష్ణః మండల పరిధిలోని కున్సి గ్రామంలో ఆదివారం రోజు ఏర్పాటు చేసిన స్థానిక విలేకరుల సమావేశంలో ఉమ్మడి మండల బిజేపి పార్టీ మండల అధ్యక్షుడు నల్లే నర్సప్ప మాట్లాడుతూ.. ప్రభుత్వం యాసంగి సీజన్ పంట వరి ధాన్యాన్ని కోనుగోలు చేసి దాదాపుగా మూడు నెలలు గడుస్తున్న రైతుల ఖాతాలో బోనస్ డబ్బులు జమ కాకపోవడం విడ్డూరమని తీవ్రంగా మండిపడ్డారు. వెంటనే రైతుల ఖాతాలో తక్షణమే భోనస్ డబ్బులు జమ చేయాలని ప్రభుత్వాన్ని హెచ్చారించారు. మాది రైతు ప్రభుత్వం అని గొప్పలు చెప్పుకోవడం తప్ప పనితనం ఏమి లేదని అంత శూన్యమే అని తెలియచేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేస్తామని మోసం చేసి అధికారంలోకి వచ్చి 50 శాతం కూడ చేయకుండా రైతులను నిలువెత్తుగా నమ్మించి నట్టెట ముంచిందని గుర్తుచేశారు. రైతులకు సరిపోయే యూరియాను అందుబాటులో ఉంచి రైతులను అన్ని విధాములుగా ఆదుకోవాలని లేని యెడల బిజేపి పార్టీ తరపున ఉమ్మడి మండల వ్యాప్తంగా రైతులతో కలిసి ఉధ్యమాలు ధర్నాలు చేస్తామని ఒక ప్రకటనలో తెలియచేశారు.
యాసంగి బోనస్ డబ్బులను రైతుల ఖాతాలో జమ చేయాలి
- Advertisement -
- Advertisement -
- Advertisement -