Thursday, September 4, 2025

రేవంత్ రెడ్డి కాళ్లను హరీష్ రావు మొక్కారనడం బాధ కలిగించింది: పద్మా దేవేందర్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: కాళేశ్వరంపై శాసనసభలో బిఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు కాంగ్రెస్ డొల్లతనాన్ని ఎండగట్టారని భారత రాష్ట్ర సమితి నేత, మాజీ డిప్యూటి స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి తెలిపారు. ఎమ్మెల్సీ కవితను సస్పెండ్ చేస్తూ మాజీ సిఎం కెసిఆర్ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని అన్నారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. సిఎం రేవంత్ రెడ్డి కాళ్లను హరీష్ రావు మొక్కారనడం బాధ కలిగించిందని, హరీష్ రావు గురించి అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. కవిత రౌండ్ టేబుల్ భేటీ పెట్టినా పార్టీ నేతలకు సమాచారం ఇవ్వలేదని, రేవంత్ రెడ్డి డైరెక్షన్ లో కవిత ఉన్నారని మండిపడ్డారు. కెసిఆర్ కుమార్తెగా కవిత గౌరవాన్ని నిలుపుకోలేకపోయారని, కవిత తనకు తానే గొయ్యి తవ్వుకున్నారని పద్మా దేవేందర్ రెడ్డి విమర్శలు గుప్పించారు.

Also Read : బిఆర్‌ఎస్ చచ్చిన పాము

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News