Wednesday, July 23, 2025

సూర్యాపేటలో ప్రాణం తీసిన వాట్సాప్ ఎమోజీ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: సూర్యాపేట జిల్లాలో దారుణం వెలుగులోకి వచ్చింది.  పద్మశాలీ ఎన్నికల నేపథ్యంలో వాట్సాప్లో ఎమోజీ పెట్టినందుకు హత్య చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆగస్టు 3న పద్మశాలీ సంఘం ఎన్నికలు జరుగనున్నాయి. పద్మశాలి సంఘం అధ్యక్ష పదవి కోసం శ్రీరాముల రాములు, ఎలగందుల సుదర్శన్ మధ్య పోటీ నెలకొంది. మాజీ అధ్యక్షుడు అప్పం శ్రీనివాస్ టార్గెట్గా శ్రీరాముల రాములు వాట్సప్ గ్రూపులో సందేశాలు పెట్టాడు. అప్పం శ్రీనివాస్కు మద్దతుగా కృపాకర్ ఎమోజీ పోస్ట్ చేశాడు. రాములు ఆగ్రహంతో కృపాకర్‌కు ఫోన్ చేసి బూతులు తిట్టాడు. కృపాకర్ వెంటనే ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేసేందుకు పద్మశాలీ భవన్‌కు వెళ్లాడు. రాములు తన కుమారుడు ధనుంజయ్‌తో పాటు మరికొందరు స్నేహితులతో కృపాకర్‌పై దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన అతడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందాడని పరీక్షించిన వైద్యులు తెలిపారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News