ఆసియాకప్‌లో భాగంగా ఆదివారం భారత్, పాకిస్థాన్‌ల మధ్య మ్యాచ్ జరుగనుంది. అయితే పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్థాన్‌తో భారత్ మ్యాచ్ (Ind VS Pak) ఆడవద్దు అంటూ పెద్ద ఎత్తున డిమాండ్లు వచ్చాయి. చివరకు కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మ్యాచ్ ఆడుతామని బిసిసిఐ ప్రకటించింది. ఈ విషయాన్ని ఐసిసితో పాటు, ఎసిసి కూడా అంగీకరించాయి. అయితే పహల్గాం దాడి బాధితురాలు ఐషాన్య ద్వివేది ఈ విషయంపై కీలక వ్యాఖ్యలు చేశారు. కొందరు క్రికెటర్లకు ఈ మ్యాచ్ ఆడటం ఇష్టం లేదని.. కానీ బిసిసిఐ వాళ్లపై ఒత్తిడి తెస్తోందని వ్యాఖ్యనించారు. అసలు మ్యాచ్‌కి బిసిసిఐ ఒప్పుకోకుండా ఉందడాల్సిందని పేర్కొన్నారు.
పహల్గాం దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారి త్యాగాలను బిసిసిఐ విస్మరిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఉగ్రదాడిలో ప్రాణాలను కోల్పోయిన వారి కుటుంబసభ్యుల ఆవేదన అప్పుడే మర్చిపోయారా? అని స్పాన్సర్లు, క్రికెటర్లను ప్రశ్నించారు. ఈ మ్యాచ్ (Ind VS Pak) ద్వారా వచ్చే ఆదాయాన్ని మళ్లీ ఆ దేశం ఉగ్రవాదులకు పోషించడానకే ఉపయోగిస్తుందని మండిపడ్డారు. మనపై దాడి మనమే వాళ్లను ప్రోత్సాహించినట్లు అవుతుందని అన్నారు. దేశ ప్రజలంతా కలసి మ్యాచ్‌ను వీక్షించకుండా బహిస్కరించాలని పిలుపునిచ్చారు.
Also Read : బిసిసిఐ అధ్యక్షుడిగా హర్భజన్.. ఇదే అందుకు సంకేతం..