Thursday, May 8, 2025

భారత సైన్యం మెరుపు దాడులు.. లైవ్ లోనే ఏడ్చిన పాక్ యాంకర్ (వీడియో వైరల్)

- Advertisement -
- Advertisement -

భారత సాయుధ దళాలు చేపట్టిన ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో ఓ పాకిస్తానీ న్యూస్ యాంకర్ ఏడుస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైన్యం పాకిస్థాన్‌కు తగిన సమాధానం ఇచ్చింది. మంగళవారం రాత్రి 1.30 గంటల ప్రాంతంలో ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో భారత సైన్యం పాక్ లోని ఉగ్రవాదుల స్థావరాలపై మిస్సైల్స్ తో విరుచుకుపడింది. భారత ఆర్మీ దాడులతో భారీగా ఉగ్రవాదులు మృతి చెందారు. ఈ క్రమంలో భారత దాడులపై లైవ్ టీవీలో ఓ పాకిస్తానీ న్యూస్ యాంకర్ ఏడుస్తున్న వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది.

భారత వైమానిక దాడిలో మరణించిన పాకిస్తానీ ప్రజల పట్ల ఆమె ఏడుస్తూ విచారం వ్యక్తం చేస్తున్నట్లు వీడియోలో కనిపిస్తోంది. అమాయక అమరవీరుల ఆత్మలకు శాంతి చేకూరాలని, వారి కుటుంబాలకు ధైర్యం ఇవ్వాలని అల్లాను ప్రార్థించింది. ఈ వీడియోలోని యాంకర్ పై నెటిజన్స్ ట్రోల్స్ చేస్తున్నారు. ఉగ్రవాదులు చనిపోతే ఎందుకు ఏడుస్తున్నావ్.. ఎందుకంత బాధ పడుతున్నావ్ అంటూ కొందరు కామెంట్స్ చేస్తుండగా.. యాంకర్ మాత్రం కత్తిలా ఉందని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News