Monday, May 12, 2025

ఆ నష్టానికి బాధ్యత పాక్‌ సైన్యానిదే: ఎకె భారతి

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ఆపరేషన్ సింధూర్‌లో(Operation Sindoor) భాగంగా మే 7న భారత్ జరిపిన దాడుల గురించి రక్షణశాఖ అధికారులు మీడియా సమావేశంలో వెల్లడించారు. పాకిస్థాన్‌పై జరిగిన దాడుల వీడియోలను అధికారులు ప్రదర్శించారు. ఉగ్రవాదులపై చేస్తున్న ఈ దాడులను తమపై దాడిగా పాక్‌ సైన్యం మలుచుకుందని.. దాని భారత్ ధీటుగా జవాబిచ్చిందని పేర్కొన్నారు. కాబట్టి పాక్‌ సైన్యానికి నష్టం వాటిల్లితే వారే బాధ్యలని తెలిపారు. పాక్‌లోని నూర్‌ఖాన్, రహీమ్‌యార్‌ఖాన్ ఎయిర్‌బేస్‌లపైనా చేసిన దాడులను ఈ సమావేశంలో ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో ఎయిర్ మార్షల్(Air Marshal) ఎకె భారతి, వైస్‌ అడ్మిరల్ ప్రమోద్‌, డిజిఎంవొ రాజీవ్ ఘాయ్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎయిర్‌మార్షల్(Air Marshal) ఎకె భారతి మాట్లాడుతూ.. ‘‘పాకిస్థాన్, పిఒకెలో చేపట్టిన ఆపరేషన్ విజయవంతమైంది. ఉగ్రవాదుల శిబిరాలే లక్ష్యంగా దాడులు చేశాం. అత్యాధునిక క్షిపణి రక్షణ వ్యవస్థలతో పాక్ క్షిపణులు, డ్రోన్‌లను తిప్పికొట్టాం. స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఆకాశ్‌ను ఈ ఆపరేషన్‌లో సమర్థంగా వినియోగించాం. పాక్‌లో సామాన్య పౌరులకు నష్టం జరగలేదు. కానీ, పాక్‌వైపు నుంచి వచ్చిన దాడులను సమర్థంగా ఎదురుకున్నాం. చైనా తయారు చేసిన పిఎల్-15 క్షిపణిని నేలకూల్చాం. ఉగ్రవాదంపై పోరాటంలో పాక్‌ సైన్యం జోక్యం చేసుకుంటే తిప్పికొట్టాం. కరాచీ సమీపంలో లక్ష్యాలపైనా దాడులు చేశాం’’ అని ఆపరేషన్ సింధూర్(Operation Sindoor) గురించి ఆయన వివరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News