- Advertisement -
కాల్పుల విరమణకు అంగీకరించిన కొన్ని గంటలకే పాకిస్తాన్ మళ్లీ దాడులకు పాల్పుడుతున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. శనివారం రాత్రి జమ్మూ కాశ్మీర్, పంజాబ్, రాజస్థాన్ రాష్ట్రాలను లక్ష్యంగా చేసుకుని పాక్ డ్రోన్లతో దాడి చేస్తోంది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ.. ఈ మూడు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాలపై దాడులకు యత్నిస్తోంది. శ్రీనగర్‌లో భారీగా పేలుళ్ల శబ్దాలు వినిపిస్తున్నాయి.
అలాగే, సరిహద్దు నియంత్రణ రేఖ వెంబడి కాల్పులకు దిగుతుండటంతో దీటుగా స్పందించాలని సరిహద్దు భద్రతా దళం (బిఎస్‌ఎఫ్)ని భారత ఆర్మీ ఆదేశించినట్లు వర్గాలు తెలిపాయి. ఇప్పటికే భారత సాయుధ దళాలు అప్రమత్తమయ్యాయి. ఇవాళ సాయంత్రమే కాల్పుల విరమణకు అంగీకరిస్తున్నట్లు పాక్ చెప్పిన సంగతి తెలిసిందే. ఇదే విషయాన్ని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కూడా ప్రకటించారు.
- Advertisement -