Friday, August 29, 2025

పాక్‌ కెప్టెన్‌కి చిరాకు తెప్పించిన ప్రశ్న.. ఏమీ చేయలేకపోయాడు పాపం..

- Advertisement -
- Advertisement -

ఆసియాకప్‌-2025 మరికొన్ని రోజుల్లో ప్రారంభం కానుంది. ఈ టోర్నమెంట్‌లో పాల్గొనేందుకు ఇప్పటికే పాకిస్థాన్, అఫ్ఘానిస్థాన్ జట్లు యుఎఇకి చేరుకున్నాయి. ఆసియాకప్‌కి ముందు యుఎఇతో ఈ రెండు జట్లు ముక్కోణపు సిరీస్‌లో తలపడనున్నాయి. అయితే ఈ సందర్భంగా పాకిస్థాన్‌, (Salman Agha) ఆఫ్ఘానిస్థాన్ మధ్య జరిగే తొలి మ్యాచ్‌కి ముందు మీడియా సమావేశం నిర్వహించారు. ఇందులో మూడు జట్లు కెప్టెన్లు పాల్గొన్నారు.

అయితే ఈ సమావేశంలో ఓ రిపోర్టర్ అడిగిన ప్రశ్న పాకిస్థాన్ కెప్టెన్ సల్మాన్ అఘాకు (Salman Agha) చిరాకు తెప్పించింది. కానీ, అతడు ఏమీ చేయలేక చూస్తూ ఉండిపోయాడు. అఫ్ఘానిస్థాన్ జట్టు కెప్టెన్ రషీద్ ఖాన్‌కి ఉద్దేశిస్తూ.. ‘‘ఆసియాలోనే రెండో ఉత్తమమైన జట్టు మీదే కదా.. ఆసియా కప్‌కి ఎలా సన్నద్దమవుతున్నారు’’ అని ఓ రిపోర్టర్ ప్రశ్నించాడు. దీంతో పాక్ కెప్టెన్ సల్మాన్ ఆఘా అసహనానికి గురయ్యాడు. అటు నవ్వలేక.. ఇటు ఆ సందర్భంలో ఆగ్రహం వ్యక్తం చేయలేకపోయాడు. ‘ఎక్కడికి వెళ్లినా మమ్మల్ని వదలరుగా’ అంటూ ఇబ్బందిపడ్డాడు.

పాకిస్థాన్ జట్టు ఈ మధ్యకాంలో అత్యంత చెత్త ప్రదర్శన చేస్తోంది. తమ దేశం ఆతిథ్యమిచ్చిన ఛాంపియన్స్ ట్రోఫీలో గ్రూప్ దశలోనే ఎలిమినేట్ అయింది. పాకిస్థాన్ అంటే ఒకప్పుడు గౌరవం ఉండేది. కానీ, కీలక ఆటగాళ్లు లేక ఆ జట్టు బలం కోల్పోతుంది. ఈ నేపథ్యంలో పాకిస్థాన్‌న్ని చిన్నచూపు చూడటం మొదలైంది. ఈ క్రమంలోనే సదరు రిపోర్టర్ ఆఫ్ఘాన్‌ని రెండు బెస్ట్ జట్టు అని అన్నాడని నెటిజన్లు అంటున్నారు. ఇక ఆసియా కప్‌లో భారత్, పాకిస్థాన్ మధ్య సెప్టెంబర్ 14న మ్యాచ్ జరుగనుంది.’

Also Read : టీమిండియా కూర్పుపై ఆ ఆటగాళ్ల జోక్యం అవసరం లేదు: గావస్కర్

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News