ఆసియాకప్-2025లో అతిపెద్ద పోరు ఆదవారం జరగనుంది. చిరకాల ప్రత్యర్థుల మధ్య జరిగే ఆసక్తికర పోరును చూసేందు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఈ మ్యాచ్‌కి ముందు ఈరోజు(శుక్రవారం) పాకిస్థాన్.. ఒమన్‌తో తలపడనుంది. ఇఫ్పటికే ఈ సిరీస్‌లో భారత్.. యుఎఇతో తలపడింది. ఈ మ్యాచ్‌లోపసి కూన యుఎఇ అత్యంత చెత్త పదర్శన చేసింది. భారత్‌కు ఏ మాత్రం పోటీ ఇవ్వలేకపోయింది. దీంతో భారత్ ఈ మ్యాచ్‌లో గెలిచింది. (Jasprit Bumrah)
అయితే ఇప్పుడు పాకిస్థాన్‌తో జరిగే మ్యాచ్ కోసం భారత్ అంతా సిద్ధం చేసుకుంటుంది. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ మాజీ ఆల్‌రౌండర్ తన్వీర్ అహ్మద్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. టీం ఇండియా స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) బౌలింగ్‌లోను పాక్ యువ ఓపెనర్ సైమ్ సైమ్ అయూబ్ చితక్కొటతాడని అహ్మద్ వ్యాఖ్యానించాడు. బుమ్రా ఓవర్‌లో ఆరు బంతులకు ఆరు సిక్సులు కొడతాడని పేర్కొన్నాడు. దీనిపై భారత క్రికెట్ అభిమానులు గట్టిగా కౌంటర్ ఇస్తున్నారు. సిక్సులు కాదు.. కనీసం ఫోర్ అయినా కొడతాడా? అని సెటైర్లు వేస్తున్నారు.
Also Read : ఏడు నెలలు క్రికెట్‌కి దూరం.. తొలి మ్యాచ్‌లో రెచ్చిపోయిన అర్జున్..