- Advertisement -
మన తెలంగాణ/ఖానాపురం: వరంగల్ జిల్లాలోనే ప్రముఖ సాగునీటి వనరుల్లో ఒకటైన పాకాల సరస్సు నీటి మట్టం గత రెండు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలతో రోజు రోజుకు పెరుగుతూ మంగళవారం సాయంత్రం నాటికి 28.6 అడుగలకు చేరుకుంది. వర్షకాలం ఆరంభం నాటికి 16 ఫీట్ల వరకే ఉన్న సరస్సు ఇటీవల కురిసిన వర్షాలతో ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరదలు రావడంతో పాకాల జల కలను సంతరించుకుంది. అడుగున్నర నీరు వస్తే చెరువు మత్తడి పోసే అవకాశం ఉండటంతో ఆయకట్టు రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పాకాల జల కలను సంతరించుకోవడంతో వరి నాట్లు ముగింపు దశకు చేరుకున్నాయి.
- Advertisement -