- Advertisement -
భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. పాక్ దాడులను భారత ఆర్మీ తిప్పికొడుతూనే ఉగ్రస్థావరాలపై విరుచుకుపడుతోంది. దీంతో పాకిస్తాన్ సైన్యం జనావాసాలపై దాడులు తెగబడుతోంది. ఓ వైపు, నియంత్రణ రేఖ వెంబడి విచక్షణారహితంగా కాల్పులకు పాల్పడుతూనే జనావాసాలపై డ్రోన్లతో దాడులు చేస్తోంది. పూంఛ్ సెక్టార్‌లో పలు ఇళ్లను పాకిస్థాన్ ధ్వంసం చేసింది. సీసీటీవీలో ఇల్లు ధ్వంసమైన విజువల్స్ రికార్డయ్యాయి. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా పోర్టులు, నౌకాశ్రయాలు, టెర్మినళ్లలో భద్రత పెంపుకు ఆదేశాలు జారీ చేసింది. భద్రత రెండో లెవల్‌కు పెంచుతూ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.
- Advertisement -