Friday, May 9, 2025

భీకర పోరు

- Advertisement -
- Advertisement -

రాజస్థాన్‌లో ఎఫ్16ను కూల్చివేసిన భారత సైన్యం పాకిస్తాన్‌కు చెందిన మరో రెండు ఫైటర్‌జెట్లు
నేలమట్టం అంగీకరించిన పాకిస్తాన్ గురువారం రాత్రి డ్రోన్లతో రెచ్చిపోయిన పాక్ బలగాలు జమ్మూ
విమానాశ్రయం లక్షంగా డ్రోన్ల దాడి జమ్మూ, కశ్మీర్, అఖ్నూర్, ఉద్దంపూర్, జలంధర్‌లపై క్షిపణుల
దాడులు సమర్థవంతంగా తిప్పికొట్టిన భారత బలగాలు ఉదయం నుంచి క్షిపణులు, డ్రోన్లతో దాడులు
చేస్తున్న దాయాది పాక్ క్షిపణి రక్షణ వ్యవస్థలపై భారత్ దాడి లాహోర్‌లో మోహరించిన హెచ్‌క్యూ-9
క్షిపణి విధ్వంసక వ్యవస్థ ధ్వంసం ఇజ్రాయెల్ డ్రోన్‌తో విరుచుకుపడిన భారత బలగాలు పోఖ్రాన్ ఆర్మీ
స్టేషన్‌పై దాడికి పాక్ యత్నం తాజా పరిణామాలతో ఆర్మీ చీఫ్‌తో ప్రధాని మోడీ భేటీ త్రివిధ దళాలతో
రక్షణమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ చర్చలు ప్రధానికి పరిస్థితిని వివరించిన అజిత్ ధోవల్ సరిహద్దు రాష్ట్రాల
సిఎంలతో ప్రధాని చర్చలు అనేక ప్రాంతాల్లో బ్లాక్ అవుట్లు భారత్‌కు రక్షణగా నిలిచిన ఎస్400 వ్యవస్థ

న్యూఢిల్లీ: బ్లాకౌట్లు చిమ్మ చీకట్ల నడుమ భా రతదేశ ఉత్తర ప్రాంతం ఉత్తర ఎగువ ప్రాం తం, ప్రత్యేకించి సరిహద్దు రాష్ట్రాలపై పాకిస్థాన్ తెగబడి దాడులకు దిగుతోంది. సరిహ ద్దు రాష్ట్రాలలో ప్రత్యేకించి జమ్మూ పంజాబ్ లలో దాడులు ప్రతిదాడులు , పాకిస్థాన్ ఫైట ర్ విమానాలను తరిమికొడుతున్న భారతీ య యుద్ధ విమానాల హోరుతో అప్రకటిత యుద్ధ వాతావరణం ఏర్పడింది. కేవలం మి స్సైల్స్ వీటికి తోడుగా డ్రోన్ల దాడులతో గగనతలం అంతా రణరంగం అయ్యే పరిస్థితి ఏర్పడింది. ఆపరేషన్ సిందూర్‌తో చావుదెబ్బతిన్న పాకిస్థాన్ ఇప్పుడు అత్యంత వ్యూహాత్మకంగా బుధవారం అర్థరాత్రి దాటిన తరువాత ఆరంభించిన అధునాతన డ్రోన్లు, క్షిపణులు, ఎఫ్16 యుద్ధ విమానాల దాడులు , వీటిని అత్యంత సమర్థవంతంగా తిప్పికొట్టిం ది. అయితే పాక్ సైన్యం వెనుతిరిగినట్లుగా ఉంటూనే అదును చూసుకుని మెరుపుదాడులకు దిగుతూ రావడంతో భారతీయ సైన్యం అన్ని శ్రేణులలో అన్ని స్థాయిల్లో అప్రమత్తం గా ఉంది. తమకు అనువైన జమ్మూ కశ్మీర్‌లోని కొన్ని ప్రాంతాల ఆవల నుంచి పాకిస్థా న్ సైన్యం విరుచుకుపడుతోందని వెల్లడైంది. జమ్మూ , పంజాబ్ లోపలి ప్రాంతాలు ప్రత్యేకించి అమృత్‌సర్, రాజస్థాన్‌ల్లోని ప్రాంతాల ను ఎంచుకుని పాక్ డ్రోన్లు దూసుకురావడం తో పలు ప్రాంతాల్లో బ్లాకౌట్ పరిస్థితి ఏర్పడింది.

పలు సరిహద్దు ప్రాంతాలలో ప్రత్యేకించి జలంధర్, అమృత్‌సర్, గుజరాత్‌లోని కొన్ని ప్రాంతాలు, హర్యానాలో, అన్నింటికి మించి జమ్మూ కశ్మీర్‌లోని లోతట్టు ప్రాంతాలలో ఇప్పుడు అప్రకటిత యుద్ధ వాతావర ణం నెలకొంది. బుధవారం అర్థరాత్రి తరువాత అత్యంత బలీయ వైమానిక దాడులతో ముందుకు సాగేందుకు పాక్ వైమానిక దళా లు యత్నించాయి. చైనా తమకు అంతకు ముందు అందించిన కీలకమైన యుద్ధవిమానాలను కూడా రంగంలోకి దింపాయి. అ యితే రష్యా నిర్మిత ఆయుధ విధ్వంసకర వ్యవస్థలతో భారత సైన్యం పాక్ దాడిని తిప్పికొట్టింది అంతేకాకుండా అత్యంత వ్యూహాత్మకంగా పాక్ లోలోపలికి చొచ్చుకు వెళ్లి, పాకిస్థాన్ వాణిజ్య రాజధాని వంటి లాహోర్‌లోని వైమానిక ఆయుధ వ్యవస్థను పూర్తి స్థాయిలో ధ్వంసం చేశారు తెల్లవారుజామున భారతీ య సైన్యానికి దక్కిన ఘన విజయంగా దీ నిని నిర్థారించారు. అయితే ఆ తరువాతి దశ లో పాక్ సైన్యం తిరిగి దాడులు సాగించిం ది. ముందు జాగ్రత్త చర్యగా సరిహద్దు రాష్ట్రాలలో విద్యుత్ సరఫరా నిలిపివేశారు. పౌరులను ఇండ్లల్లో ఉండాలని కట్టడి చేశారు. ప లు చోట్ల సైరన్ల మోతలు, సైనిక వాహనాల తో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. విరామం నడుమ గగనతలంలో దూసుకువెళ్లుతున్న పలు రకాల యుద్ధవిమానాల సవ్వడితో భయానక పరిస్థితి ఏర్పడింది.

బాగా దెబ్బతిన్న పాకిస్థాన్ ఇప్పుడు తెగించిన స్థాయికి చేరింది. విపరీత చర్యలకు దిగుతుందనే ఆందోళనకు గురవుతున్నామని, అయితే భారతీయ సైన్యం పాక్‌ను నిలువరిస్తుందని పలు ప్రాంతాల్లోని ప్రజానీకం విశ్వాసం వ్యక్తం చేసింది. ముందుగా డ్రోన్లతో దాడి తరువాత కీలక స్థావరాలను ఎంచుకుని విరుచుకుపడటం జరిగింది. జమ్మూ సిటీలో ఏడు చోట్ల పేలుళ్లు జరిగాయి. ఈ ఘటనల వివరాలు తెలియలేదు. పాక్ ప్రయోగించిన 8 క్షిపణులను భారతీయ సైన్యం విజయవంతంగా తిప్పికొట్టింది. శ్రీనగర్ పరిసరాల్లో దాడులకు తెగబడింది. వీటిని భారతీయ సైన్యం సకాలంలో తిప్పికొట్టిందని భద్రతా వర్గాలు తెలిపాయి. పంజాబ్ మారుమూల ప్రాంతాలలో జనం అప్రమత్తం అయ్యారు. చాలా దూరం వరకూ పాకిస్థాన్ లోపలికి మన విమానాలు వెళ్లినట్లు సమాచారం అందింది. దాడులకు దిగిన పాక్ క్షిపణులను భారతీయ సైన్యం ఎస్ 400 ఆయుధ వ్యవస్థలతో ధ్వంసం చేశారు. సరిహద్దుల్లోని రాజౌరీలోని 120 బ్రిగేడ్స్ క్యాంప్‌పై పాక్ ఆత్మాహుతి దాడి జరిగింది. దీని వివరాలువెల్లడికాలేదు.

రెండు జెఎఫ్ పాక్ యుద్ధ విమానాల కూల్చివేత
దాడులకు పాల్పడ్డ పాక్ ఎఫ్ 16 యుద్ధ విమానాలను భారత సైన్యం గుర్తు తెలియని ప్రాంతంలో కూల్చివేసింది. ముందుగా ఒక్క యుద్ధ విమానం కూల్చివేశారని అధికారులు తెలిపారు. తరువాత క్రమంలో రెండు విమానాల పతనం గురించి భారత సైనికాధికారులతో పాటు పాక్ ఆర్మీ కూడా తెలిపింది. ఇక పాకిస్థాన్‌కు చెందిన అత్యంత కీలకమైన ఎనిమిది వరకూ క్షిపణులను భారతదేశ సైన్యం కూల్చివేసింది. భారత సైన్యం కేవలం నిర్ణీత ఉగ్రవాద స్థావరాలను టార్గెట్ చేసుకుని విజయవంతంగా పనిపూర్తి చేసుకుంది. అయితే ఇందుకు భిన్నంగా పాక్ సైన్యం అతి కొద్ది విరామం ఇస్తూ అప్రకటిత యుద్ధానికి దారితీస్తూ వస్తోంది. పాకిస్థాన్ ప్రయోగించిన డ్రోన్ జమ్మూ ఎయిర్‌పోర్టును దెబ్బతీసింది. అయితే దీని వివరాలు తెలిసిరాలేదు. కానీ ముందు జాగ్రత్త చర్యగా ఉత్తరాది, సరిహద్దులలో ఎయిర్‌పోర్టుల మూసివేతలు, విమానాల నిలిపివేతలతో నష్టం వాటిల్లలేదని వెల్లడైంది. అయితే అర్థరాత్ర ఆ తరువాత కూడా అనూహ్య రీతిలో దాడులకు పాకిస్థాన్ ప్లానింగ్ ఉందనే సమాచారంతో సైన్యంతో పాటు సామాన్య జనం కూడా అప్రమత్తం అయింది. పఠాన్‌కోట్‌లోని అత్యంత కీలకమైన వైమానిక స్థావరం వద్ద అత్యంత శక్తివంతమైన రెండు పేలుళ్లు సంభవించాయి. ఉధంపూర్‌లో కూడా ఎయిర్‌బేస్ వద్ద దాడులు జరిగాయి. అయితే ఈ ఘటన వివరాలు వెల్లడికాలేదు. ఈ ప్రాంతం పాకిస్థాన్‌కు అత్యంత సమీపంలో ఉంది.

ప్రధానితో అజిత్ దోవల్ భేటీ
పాకిస్థాన్ నుంచి సాగుతోన్న దాడులు, మన సేనల ఎదురుదాడి గురించి ప్రధాని మోడీకి జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ గురువారం రాత్రి వివరించారు. సరిహద్దు రాష్ట్రాలలో ఇప్పటి పరిస్థితిని సమీక్షించేందుకు ఆయన ఇతర ఉన్నతాధికారులతో కలిసి ప్రధాని అధికారిక నివాసానికి హుటాహుటిన తరలివచ్చారు. ప్రస్తుత ఉద్రిక్తతల దశలో భారత క్రికెట్ మండలి బిసిసిఐ ఇండియా, ఇతర చోట్ల భారతీయ క్రికెట్ జట్టు పాల్గొనే మ్యాచ్‌లను రద్దు చేసింది. ప్రధాని మోడీతో భారత సైనిక ప్రధానాధికారి అత్యవసర భేటీ నిర్వహించారు. పరిస్థితిని ఉన్నత స్థాయిలో సమీక్షించారు. త్రివిధ బలగాల మరింత సమన్వయంతో పాకిస్థాన్ చర్యలను తిప్పికొట్టే శక్తి మనకు ఉందని సైనిక శ్రేణులకు ప్రధాని పిలుపు ఇచ్చారు. ప్రస్తుత పరిస్థితుల్లో సంయమనం అవసరం అని అమెరికా విదేశాంగ మంత్రి రూబియో విదేశాంగ మంత్రి జైశంకర్‌తో ఫోన్‌లో మాట్లాడుతూ తెలిపారు. ఆయన పాక్ ప్రధానితో కూడా మాట్లాడారు. కాగా రెండు దేశాల మధ్య ఉద్రిక్తతల నివారణకు తమ దేశం చర్చలకు సిద్ధంగా ఉందని అమెరికా తెలిపింది. ఇది తమ నేత ట్రంప్ సందేశం అని వివరించారు. సరిహద్దు రాష్ట్రాలలో ఇప్పటి పరిస్థితి తరువాత పలు చోట్ల ప్రభుత్వోద్యోగులకు సెలవులు రద్దు చేశారు. తక్షణం విధులకు రావాలని ఆదేశించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News