Sunday, August 17, 2025

పాకిస్తాన్‌లో పరిస్థితి దారుణం.. లీటర్ పెట్రోల్ ధర రూ.266

- Advertisement -
- Advertisement -

ఇస్లామాబాద్: పాకిస్తాన్ ప్రజలు ఇప్పటికే అధిక ద్రవ్యోల్బణంతో సహా అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నారు. ఆర్థిక ఇబ్బందుల నుంచి బయట పడేందుకు పాక్ ప్రభుత్వం అన్ని దారులను వెతుకుతోంది. ఈ క్రమంలో ప్రజలపై మరింత భారం మోపేందుకు సిద్ధమైంది. తాజాగా వాహనాదారులకు షాకిస్తూ.. దేశంలో పెట్రోల్, డీజిల్ ధరల పెంచుతున్నట్లు పాక్ సర్కార్ ప్రకటించింది. ఇప్పటికే భారీగా పెంచిన ఆయిల్ ధరలతో వాహనాదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒక నెలలో ఆయిల్ ధరలను పెంచడం ఇది రెండవసారి. జూన్ 16న పెట్రోల్ లీటరుకు రూ.4.80, హై-స్పీడ్ డీజిల్ రూ.7.95 పెంచింది.

ఆర్థిక శాఖ నోటిఫికేషన్ ప్రకారం.. తాజాగా పాకిస్తాన్‌లో లీటరు పెట్రోల్ ధరపై రూ.8.36 పెరిగింది. దీంతో పెట్రోల్ ధర లీటరుకు రూ.258.43 నుండి రూ.266.79కి చేరుకుంది. హై-స్పీడ్ డీజిల్ ధర లీటరుకు రూ.10.39 పెంచడంతో.. లీటరు ధర రూ.262.59 నుండి రూ.272.98కి పెరిగింది. జూలై 1 నుండి పాకిస్తాన్‌లో పెట్రోల్, డీజిల్ కొత్త ధరలు అమల్లోకి వచ్చినట్లు పేర్కొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News