Friday, August 15, 2025

కరాచీ కాల్పుల్లో ముగ్గురు మృతి

- Advertisement -
- Advertisement -

ఒక్కరోజు ముందు స్వాతంత్య్రం వచ్చిన పొరుగుదేశం పాకిస్థాన్‌లో గురువారం వీధులలో విచ్చలవిడిగా తుపాకీ కాల్పులు, దౌర్జన్యకర ఘటనలు జరిగాయి. కరాచీ ఇతర ప్రాంతాలలొ అల్లరిమూకల కాల్పుల్లో ముగ్గురు మృతి చెందారు. పలువురు గాయపడి , ఆసుపత్రుల పాలయ్యారు. ఉత్సవాలు మితిమీరి కొందరు చేతుల్లోని తుపాకులు పేలుస్తూ జరిపిన కాల్పుల్లో అనేక మంది గాయపడ్డారని అధికారులు తెలిపారు. జాతీయ ఉత్సవాల దశల్లో పాకిస్థాన్‌లో జనం ఇష్టారాజ్యంగా వ్యవహరించడం ఓ ఆనవాయితీ అయింది. గుంపుగా రావడం, కాల్పులు జరిపి వెళ్లిపోవడం పరిసాటిగా మారింది. ఇటువంటి అరాచకాలు మానుకోవాలని , ఇటువంటి వారిని గుర్తించి తగు విధంగా శిక్షిస్తామని అధికారులు హెచ్చరించారు. ‘

ఉత్సవాలను ప్రశాంతంగా, ఆనందంగా నిర్వహించుకోవాలని పిలుపు నిచ్చారు. ప్రధాన నగరం కరాచీలో అనేక చోట్ల కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఓ వృద్ధుడు, 8 సంవత్సరాల పాప మృతి చెందారు. కాల్పుల్లో ఇక్కడ ఒక చోటనే 60 మంది వరకూ గాయపడ్డారని అధికారులు వెల్లడించారు. వీధుల్లో ఆడుకుంటున్న బాలికకు తుపాకీ తూటా వచ్చి తగిలింది. దీనితో ఆమె అక్కడికక్కడే చనిపోయిందని జియో న్యూస్ తెలిపింది. కరాచీలోనే ఈ ఏడాది జనవరిలో జాతీయ స్థాయి ఉత్సవాలలో జరిగిన దౌర్జన్యకర ఘటనల్లో మొత్తం 42 మంది మృతి చెందారు. పలువురు గాయపడ్డారు. ఇటువంటి వేడుకలను సాకుగా తీసుకుని కొందరు ఈ నేపథ్యంలో పాత కక్షలను తీర్చుకుంటారని అధికారులు అనుమానిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News