Friday, August 15, 2025

విండీస్‌లో నయా జోష్!

- Advertisement -
- Advertisement -

ట్రినిడాడ్: వరుస ఓటములతో సతమతమవుతున్న వెస్టిండీస్ క్రికెట్ టీమ్‌కు వన్డేల్లో పాకిస్థాన్‌పై విజయం సరికొత్త దారిచూపిందని చెప్పాలి. ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్‌లో విండీస్ (Windies) ఘోర పరాజయాలను చవిచూసింది. దీనికి తోడు పాకిస్థాన్‌తో జరిగిన టి20లలో కూడా ఓటమి పాలైంది. సొంత గడ్డపై ఇలా అవమానకర ఓటములు ఎదురవడంతో విండీస్ టీమ్ దిక్కుతోచని స్థితిలో పడిపోయింది. ఇదే సమయంలో పలువురు కీలక ఆటగాళ్లు ఒక్కొక్కరే అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటిస్తూ జట్టును మరింత ఆత్మరక్షణలో పడేశాడు. ఈ స్థితిలో పాకిస్థాన్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో లభించిన విజయం విండీస్‌లో కొత్త జోష్‌ను నింపింది. రానున్న రోజుల్లో మరింత మెరుగైన ప్రదర్శన చేసేందుకు ఈ గెలుపు దోహదం చేస్తుందనడంలో ఎలాంటి స్థితిలో నికోలస్ పూరన్, ఆండ్రీ రసెల్ వంటి స్టార్ ఆటగాళ్లు అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించారు. చాలా కాలంగా వీరు విండీస్ టీమ్‌లో కీలక ఆటగాళ్లుగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే.

వీరే కాకుండా మరికొంత మంది అగ్రశ్రేణి క్రికెటర్లు సయితం అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికారు. దీంతో విండీస్ పరిస్థితి అత్యంత దయనీయంగా (Most pitifully) మారింది. అయితే షాయ్ హోప్ కెప్టెన్సీ బాధ్యతలను సమర్థంగా పోషించడం విండీస్‌కు కలిసివచ్చే అంశంగా చెప్పాలి. తొలి వన్డేలో ఓడినా షాయ్ హోప్ ఒత్తిడికి గురికాలేదు. మిగిలిన రెండు వన్డేల్లో జట్టును ముందుండి నడిపించాడు. చివరి వన్డేలో విధ్వంసక శతకంతో చెలరేగి పోయాడు. సహచరుల్లో కొత్త జోష్‌ను నింపుతూ జట్టును గెలుపు పథంలో నడిపించాడు. రానున్న సిరీస్‌లలో కూడా హోప్ ఇలాంటి సంప్రదాయాన్నే కొనసాగించాలని భావిస్తున్నాడు. హోప్‌తో పాటు ఇతర ఆటగాళ్లు కూడా తమవంతు బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తే విండీస్ మళ్లీ పూర్వవైభవం దిశగా అడుగులు వేసే అవకాశం ఉంటుంది. 70, 80 దశకాల్లో ప్రపంచ క్రికెట్‌లో విండీస్ ఎదురులేని శక్తిగా కొనసాగేది.

టెస్టులు, వన్డేల్లో ఆ జట్టుకు ఎదురు ఉండేది కాదు. ప్రమాదకర బ్యాటర్లు, బౌలర్లలతో విండీస్ అరివిరభయంకర జట్టుగా పేరుతెచ్చుకుంది. విండీస్‌తో పోరు అంటేనే భారత్, శ్రీలంక, న్యూజిలాండ్ జట్లు ముందే చేతులెత్తేసేవి. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, పాకిస్థాన్‌లు మాత్రమే విండీస్‌కు కాస్త పోటీ ఇచ్చేవి. కానీ రానురాను విండీస్ ఆటతీరు తీసికట్టుగా తయారైంది. స్టార్ ఆటగాళ్లు రిటైర్మెంట్ బాటపట్టడంతో విండీస్ పరిస్థితి చాలా దయనీయంగా మారింది. ఆ దేశ క్రికెట్ బోర్డు వ్యవహరించిన తీరు కూడా విండీస్ టీమ్ దుస్థితికి ప్రధాన కారణంగా చెప్పాలి. ఒకప్పుడూ ప్రపంచ క్రికెట్‌ను శాసించిన విండీస్ ప్రస్తుతం వరల్డ్ కప్, ఛాంపియన్స్ ట్రోఫీ వంటి టోర్నీలకు అర్హత కూడా సాధించలేక పోతోంది. దీన్ని బట్టి వెస్టిండీస్ పరిస్థితి ఎంతగా దిగజారిపోయిందో ఊహించుకోవచ్చు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News