ఆపరేషన్ సిందూర్ తర్వాత పాకిస్తాన్ డ్రోన్స్, మిస్సైల్స్ తో భారత్ పై దాడులకు దిగుతోంది. జమ్ము విమానాశ్రయం లక్ష్యంగా పాక్ డ్రోన్ దాడులకు తెగపడుతోంది. దీంతో వెంటనే అప్రమత్తమైన భారత సైన్యం పాక దాడులను తిప్పికొడుతోంది. ఇప్పటికే మూడు పాక్ డ్రోన్లను కూల్చివేసినట్లు తెలుస్తోంది. పాక్ దాడులకు పాల్పడుతుండటంతో జమ్మూకశ్మీర్, రాజస్థాన్, పంజాబ్, హరియాణాలో హైఅలర్ట్ ప్రకటించారు. జమ్ములో సైరన్ మోగించి ప్రజలను అప్రమత్తం చేశారు.
మరోవైపు సరిహాద్దు ప్రాంతాల్లో పాక్ సైన్యం విచక్షణారహితంగా కాల్పులు జరుపుతోంది. యుద్ధవాతారవణం నెలకొనడంతో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అధికారులతో అత్యవసర భేటీ అయ్యారు. ఈ సమావేశంలో సీడీఎస్, త్రివిధ దళాధిపతులు, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ పాల్గొన్నారు. పాక్ దాడులకు పాల్పడుతుండటంతో ముంద జాగ్రత్తగా ఢిల్లీ-పంజాబ్ మ్యాచ్ ను రద్దు చేశారు.