Tuesday, September 2, 2025

షాంఘైలో దౌత్య విజయం

- Advertisement -
- Advertisement -

పహల్గామ్ దాడిని ఖండించిన
షాంఘై సహకార శిఖరాగ్ర సదస్సు
ఏ దేశమూ ఉగ్రవాదులకు ఊతం
ఇవ్వరాదని పిలుపు ఉగ్రవాదంపై
జరిపే పోరు మానవీయ కోణంలో
సాగే విధ్యుక్తధర్మంగా అభివర్ణన
టెర్రరిజంపై ద్వంద్వ ప్రమాణాలు
ఉండరాదన్న భారత్ వైఖరికి మన్నన
షాంఘై శిఖరాగ్ర సదస్సు సంయుక్త
ప్రకటన పాక్‌కు తప్పని భంగపాటు

తియాంజిన్ (చైనా) : పాకిస్థాన్ ప్రధాని సమక్షంలోనే షాంఘై సదస్సు వేదికపై భారతదేశానికి అత్యంత కీలకమైన దౌత్య విజయం దక్కింది. భా రత్‌లోని కశ్మీర్‌లో జరిగిన పహల్గామ్ ఉగ్రదాడిని ఖండిస్తూ షాంఘై స హకార శిఖరాగ్ర సదస్సు (ఎస్‌సిఒ) సంయుక్త తీర్మానంలో స్పందన వె లువడింది. ఇతర అంతర్జాతీయ విషయాలతో పాటు ఈ ఉగ్రదాడిని ప్ర స్తావించిన షాంఘై సదస్సు విషయంలో భారతదేశానికి పూర్తి సంఘీభా వం, సంపూర్ణ సహకారం ఉంటుందని ప్రకటించింది. రెండు నెలల క్రితం క్వింగ్డావో షాంఘైసదస్సులో తమ పట్టు నెగ్గకపోవడంతో వాకౌట్ కు దిగిన భారత్ ఇప్పుడు తన పంతం నెగ్గించుకుంది. ట్రంప్ భారీ సుం కాల మోతల దశలో చైనా వేదికగా సాగిన షాంఘై భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది. రష్యా, ఉక్రెయిన్, పాకిస్థాన్ నేతలు కూడా హాజరయి న

ఈ సదస్సు సమీక్షల తరువాత సోమవారం సంయుక్త తీర్మాన ప్రకటన వెలువరించారు. ఎప్రిల్ 22వ తేదీన పహల్గామ్ ఉగ్రదాడిని సభ్యదేశాలన్ని ఖండిస్తున్నాయని తీర్మానంలో తెలిపారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సంతాపం సానుభూతి వ్యక్తం చేశారు. ఇటువంటి ఉగ్రదాడులకు ప్రేరకులు పాత్రధారులు సూత్రధారులు ఎవరైనా సరైన శిక్షలకు వి చారణకు అర్హులు, వారికి తగు శిక్ష పడాల్సిందే అని తెలిపారు. ఉగ్రవాదం వేర్పాటువాదం, తీవ్రవాదం పట్ల ఎటువంటి ఉపేక్ష తగదు. ఏ దేశం కూడా ఉగ్రవాద స్థావరాలకు వేదికలు కారాదు. ఈ క్రమంలో ఎక్కడైనా ప్రయత్నాలు జరిగితే అటువంటి చర్యలను ఆయా దేశాల ప్రభుత్వాలు మొగ్గలోనే తుడిచిపెట్టాల్సి ఉంటుందని తెలిపారు. ఉగ్రవాదానికి ఊతం ఇస్తోన్న దేశాలను కూడా ఉగ్రవాద దేశాలుగా ప్రకటించాల్సి ఉందనే భారత్ వాదనకు షాంఘై సదస్సు మద్దతు పలికింది. ఉగ్రవాదం ఏ రూపంలో ఏ కోణంలో ఉన్నా అది గర్హనీయం అవుతుంది. ఉగ్రవాద నిర్మూలనలో ద్వంద్వ ప్రమాణాలు, సాకులు వెతకడం కుదరదు. కేవలం ఈ జటిల సమస్య పరిష్కారమే లక్షంగా అంతర్జాతీయ సమాజం కలిసికట్టుగా సాగాల్సి ఉందని ఈ సదస్సు ద్వారా పిలుపు నిచ్చారు.

వాకౌట్ నుంచి తీర్మానం వరకు..
అంతకు ముందు రెండు నెలల క్రితం చైనాలోని క్వింగ్డావోలో జరిగిన షాంఘై సదస్సులో ఇటువంటి ప్రకటన లేకపోవడంపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ వాకౌట్ జరిపారు. ఇప్పుడు షాంఘై సదస్సు ద్వారానే భారత్ వాదనకు బలం చేకూరింది. షాంఘై వేదిక పై ప్రసంగించిన ప్రధాని మోడీ ఉగ్రవాదం అణచివేతలో శషభిషలు వద్దు, దాటివేతలు , ద్వంద్వ ప్రమాణాలు పనికి రావని తేల్చిచెప్పారు. మానవాళికి ముప్పు తెచ్చిపెట్టే ఉన్మాద చర్యలపై ఉపేక్ష ఎటువంటి పరిస్థితులకు దారితీస్తుంది? అనేక దేశాలు ఉగ్రవాద చర్యలతో తల్లడిల్లాయి. ఇప్పటికీ ఉగ్రవాద నిర్మూలన కొలిక్కి రాలేదు. పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ పేలవ హాజరీ, చైనా అధినేత జిన్‌పింగ్, రష్యా అధినేత పుతిన్ ఇతర దేశాల అధినేతలతో జరిగిన వార్షిక సదస్సులో ప్రధాని మాట్లాడుతూ ఉగ్రవాదంపై పోరు , కలిసికట్టు పోరు మానవీయ కోణంలో జరిపే విద్యుక్త ధర్మం అన్నారు. పాకిస్థాన్‌కు, ఉగ్రవాదానికి మద్దతు ఇస్తోన్న ఇతరులకు ప్రధాని మోడీ ఈ వేదిక నుంచి నిర్థిష్ట హెచ్చరికలు వెలువరించారు.

ఉగ్రవాదానికి సొంత ప్రయోజనాల కోసం మద్దతు నిచ్చే కొన్ని దేశాలు మనకు ఆమోదయోగ్యమా? వాటిని ఆరాధ్యప్రదంగా చూసుకుందామా? అని నిలదీశారు. ఉగ్రవాదంపై వేర్వేరు స్పందనలు, ద్వంద్వ ప్రమాణాలతో మరింత నష్టం జరుగుతుందని తేల్చిచెప్పారు. జట్టుగా నిలిస్తేనే ఉగ్రవాదం ఆటకట్టు అవుతుందన్నారు. ఉగ్రవాదాన్ని భారత్ తిప్పికొడుతుంది.ఈ క్రమంలోనే భారత్ మే 10వ తేదీన ఆపరేషన్ సిందూర్‌ను నిర్వహించింది. ఇతర దేశంలోని ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేసిందని గుర్తు చేశారు. ఇక్కడ మిత్రదేశాల కలయికతో సాగే ఎస్‌సిఒ అంటే సెక్యూరిటీ, కనెక్టివిటి ఆపర్చూనిటి అని భద్రతా అనుసంధాన సమాన అవకాశాల వేదిక ఇది కావాలని పిలుపు ఇచ్చారు. ఎస్‌సిఒ మరింత కీలక శక్తి కావల్సి ఉంది. ఇక్కడ నుంచి ప్రాంతీయ సహకారానికి, ప్రపంచ శాంతి సుస్థిరత భద్రతలకు సరైన పిలుపు వెలువడాల్సి ఉందన్నారు. ఎస్‌సిఒ నుంచి నాగరికతల పరిరక్షణ వేదిక కూడా ఏర్పాటు కావల్సి ఉందని పిలుపు నిచ్చారు. పలు ప్రాంతాల వారి నాగరికతలు, విశిష్టతల పరిరక్షకు కళలు సాంస్కృతిక పరస్పర పరిచయానికి పరిరక్షణకు వీలు అవుతుందన్నారు.

చైనా రోడ్డు నిర్మాణంపై అసంతృప్తి…
చైనాలోనే జరిగిన ఈ వేదిక ద్వారా ప్రధాని మోడీ చైనా ప్రతిపాదిత బెల్ట్ రోడ్ ఇన్షియేటివ్ (బ్రి) పట్ల నిరసన వ్యక్తం చేశారు. ఇతర దేశాల సార్వభౌమాధికారం, సమగ్రత, ప్రాదేశికతకు సవాలు విసిరే నిర్మాణాల పరస్పరం విశ్వాసం కోల్పోయే స్థితిక తీసుకువస్తాయని హెచ్చరించారు.ఈ దశలో ఆయన పాక్, చైనాలను కలిపి విమర్శించారు. ప్రధాని మోడీ తమ ప్రసంగంలో భారతదేశ ప్రగతి ప్రస్థానం వివరించారు. రిఫార్మ్ పర్‌ఫాం, ట్రాన్ష్‌ఫామ్ ( ఆర్‌పిటితో కదులుతున్నామని, దీనిని ఈ వేదిక ద్వారా ప్రపంచానికి తెలియచేస్తానని వివరించారు. సవాళ్లను అవకాశాలుగా మల్చుకోవడం ముందుకు సాగడం భారత్ లక్షం అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News