Thursday, September 4, 2025

నూర్ ఖాన్ వైమానిక స్థావరాన్ని పునర్నిర్మిస్తున్న పాక్

- Advertisement -
- Advertisement -

ఆపరేషన్ సిందూర్ సందర్భంగా ఈ ఏడాది మేలో భారతదేశం జరిపిన దాడిలో ధ్వంసమైన నూర్ ఖాన్ వైమానిక స్థావరాన్ని పాకిస్తాన్ పునర్నిర్మించుకుంటున్నది. ఎన్డీటీవీ సేకరించిన కొత్త ఉపగ్రహ చిత్రాలలో ఈ విషయం వెల్లడైంది. ఇస్లామాబాద్ కు సుమారు 25 కిలోమీటర్ల దూరంలోని పాక్ వ్యూహాత్మక మైమానిక స్థావరం నూర్ ఖాన్. పాక్ వైమానిక దళానికి కీలక ఆస్తి ఈ స్థావరం. మే10న భారత వైమానిక దళం ఈ వైమానిక స్థావరంపై జరిపిన క్షిపణిదాడి లో కాంప్లెక్స్ , డ్రోన్ ఆస్తుల కమాండ్, నియంత్రణ కోసం ఉపయోగించే రెండు ట్రక్కులు ధ్వంసం అయ్యాయి.భారతదేశం నూర్ ఖాన్ బేస్ పై ఏ క్షిపణులను ప్రయోగించిందో వెల్లడించలేదు కానీ, బ్రహ్మోస్ లేదా, స్క్లాప్ క్రూజ్ మిస్సైల్ ప్రయోగించే అవకాశం ఉంది. ఆపరేషన్ సిందూర్ సందర్భంగా బ్రహ్మోస్ ను భారతవైమానిక దళం ఎస్యు-30 యుద్ధవిమానాల నుంచి ప్రయోగించింది.

స్క్లాప్ ను రాఫెల్ నుంచి ప్రయోగించింది.
ఉపగ్రహ చిత్రాల ప్రకారం దాడి జరిగిన సమయంలో రెండు వైపులా గుడారాలు కప్పిన రెండు ట్రాక్టర్ -ట్రైలర్ ట్రక్కులు ఉన్నాయని తెలిసింది. మే 10 నాటి దాడిలో రెండు ట్రక్కులతో పాటు, పక్కనే ఉన్న భవనాలు కూడా భారీగా దెబ్బతిన్నాయని ఆనాటి శాటిలైట్ చిత్రాలలో వెల్లడైంది. మే 17 కల్లా అక్కడి శిథిలాలను పూర్తిగా తొలగించారు. అదే ప్రదేశంలో గోడలతో సహా పునర్నిర్మాణం పూర్తి చేసినట్లు సెప్టెంబర్ 3న చిత్రాలలో వెల్లడైంది. 2025 మే లోనే నూర్ ఖాన్ ఎయిర్ బేస్ పునర్నర్మాణం మొదలైంది. దెబ్బతిన్న ఎయిర్ బేస్ లోని నిర్మాణాలతో పాటు, దెబ్బతిన్న చుట్టుపక్కల భవనాలను పూర్తిగా తొలగించి, కొత్తగా నిర్మాణ కార్యక్రమాలను చేపట్టారని జియో ఇంటెలిజెన్స్ నిపుణుడు డామియన్ సైమన్ చెప్పారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News