- Advertisement -
శ్రీనగర్ : ఒకవైపు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జాతినుద్దేశించి ప్రసంగిస్తూండగానే మరోవైపు పాక్ కాల్పుల విరమణ అవగాహన ఒప్పందాన్ని ఉల్లంఘించింది. జమ్మూ కశ్మీర్‌లోని సాంబా, కథువా సెక్టార్‌లోకి పాకిస్థాన్ వైపు నుంచి డ్రోన్లు దూసుకొచ్చాయి. అయితే పాక్ డ్రోన్లను భారత క్షిపణి రక్షణ వ్యవస్థ కుప్పకూల్చింది. ముందు జాగ్రత్త చర్యగా ఈ ప్రాంతంలో అధికారులు బ్లాక్ అవుట్‌ను అమలు చేస్తున్నారు. మరోవైపు పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో కూడా సైరన్ల మోత మోగింది. బ్లాక్ అవుట్ పాటిస్తూ ఇళ్లకే పరిమితం కావాలని, తాము చెపేంత వరకు బయటకు రావొద్దని మైక్‌ల ద్వారా ప్రజలను అప్రమత్తం చేశారు. కొద్ది క్షణాల్లో అమృత్‌సర్‌లో దిగాల్సిన విమానం తిరిగి ఢిల్లీకి వెళ్లిపోవడం, అది రాడార్‌లో నిక్షిప్తం కావడం తాజా పరిణామాలను ధ్రువీకరిస్తోంది.
- Advertisement -