Sunday, May 4, 2025

కొనసాగుతున్న పాక్ కవ్వింపు చర్యలు.. సరిహద్దు వెంబడి కాల్పులు

- Advertisement -
- Advertisement -

నియంత్రణ రేఖ (LOC) వెంబడి పాకిస్తాన్ కవ్వింపులు చర్యలు కొనసాగుతున్నాయి. కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాక్ ఉల్లంఘిస్తూ రెచ్చగొట్టే చర్యలకు దిగుతోంది. వరుసగా పదో రోజు పాక్ ఆర్మీ కాల్పులకు పాల్పడింది. నిన్న రాత్రి జమ్మూ కాశ్మీర్ లోని పలు సెక్టార్లలో సరిహద్దు వెంబడి పాకిస్తాన్ ఆర్మీ కాల్పులు జరిపింది. కుప్వారా, బారాముల్లా, పూంచ్, రాజౌరి, మెంధార్, నౌషేరా, సుందర్‌బాని, అఖ్నూర్ ప్రాంతాల్లో స్వల్పంగా కాల్పులు జరిపినట్లు భారత ఆర్మీ తెలిపింది. వెంటనే అప్రమత్తమై పాక్ కాల్పులకు భారత ఆర్మీ ధీటుగా జవాబిచ్చిందని ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. కాగా, పహల్గామ్ దాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయిన తరువాత రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News