న్యూఢిల్లీ: దాయాది దేశం పాకిస్థాన్ ఎట్టకేలకు కాళ్ల బేరానికి వచ్చింది. ఈ మేరకు భారత్‌కు(India) పాకిస్థాన్ లేఖ(Letter) రాసింది. పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత సింధూ జలాలా ఒప్పందంపై భారత్ తీసుకున్న నిర్ణయాన్ని మరోసారి సమీక్షించుకోవాలని పాక్(Pakistan) పేర్కొంది. ఆపరేషన్ సింధూర్ గురించి ప్రధాని నరేంద్ర మోదీ ‘మాట్లాడుతూ.. తీవ్రవాదం, వ్యాపారం కలిసి సాగలేవు. నీరు, రక్తం కలిసి ప్రవహించలేవు’ అని అన్నారు. దీంతో ఉగ్రవాదంపై భారత్ వైఖరి గురించి ఆయన స్పష్టం చేశారు. పాకిస్థాన్‌పై భారత్ విధించిన ఆంక్షలు కొనసాగుతాయని సూచించారు.
పహల్గామ్ ఉగ్రదాడి ప్రతీకారంగా సింధు జలాల ఒప్పందాన్ని భారత్(India) నిలిపివేసింది. దీంతో పాకిస్థాన్‌కు నీటి సమస్య మొదలైంది. ఈ సమస్య మొత్తం ఖరీఫ్ పంట మీద పడకముందే బయటపడాలని భారత్‌కు పాక్(Pakistan) లేఖ రాసింది.పాకిస్థాన్ జలవనరుల మంత్రిత్వ శాఖ కార్యదర్శి.. సయ్యద్ అలీ ముర్తుజా భారత జల శక్తి మంత్రిత్వ శాఖ కార్యదర్శికి రాసిన లేఖలో(Letter) సింధూ జలాల ఒప్పందం విషయంలో మరోసారి ఆలోచించాలని కోరింది.