Thursday, May 15, 2025

సింధూను వదలండి

- Advertisement -
- Advertisement -

నదీ జలాల నిలిపివేతతో తీవ్ర సంక్షోభం
భారత విదేశాంగశాఖకు పాక్
జలవనరుల మంత్రిత్వశాఖ లేఖ

ఇస్లామబాద్/ న్యూఢిల్లీ: సింధు నదీ జలాల ఒప్పందం రద్దు నిర్ణయం పునః పరిశీలించాలని పాకిస్థాన్ బుధవారం భారతదేశాన్ని అభ్యర్థించింది. పహల్గాం ఉగ్రదాడి తరువాతి దశలో భారతదేశం ఈ ఒప్పందం నిలిపివేసింది. దీనితో నెలకొన్న సంక్షోభం గురించి భారతదేశం తక్షణం పరిశీలించాల్సి ఉందని పాకిస్థాన్ జలవనరుల మంత్రిత్వశాఖ ఇప్పుడు భారత విదేశాంగ మంత్రిత్వశాఖకు లేఖ రాసింది. ఈ లేఖను అత్యవసర ప్రాతిపదికన పరిశీలించాలని, ఇంతకు ముందటి నిర్ణయాన్ని సమీక్షించాలని ఇందులో తెలిపారు. సింధూ ఒప్పందంపై భారత్ కీలక నిర్ణయంతో నీళ్ల నిలిపివేత ఈ క్రమంలో పాకిస్థాన్‌లోని జలాశయాల్లోకి క్రమేపీ నీరు తగ్గడం , ప్రధాన జల విద్యుత్ కేంద్రాలలో ఉత్పత్తి ప్రమాదకర క్షీణత దశకు చేరుకుంటూ ఉండటంతో పాక్ ఇప్పుడు భారత్‌తో దాదాపుగా కాళ్లబేరానికి వచ్చినంత పనిచేసింది. దయచేసి పరిశీలించండని కోరారు.

ఒప్పందం నిలిపివేత తమ దేశానికి జల సంక్షోభం తెచ్చిపెడుతుందని ఈ లేఖలో పాకిస్థాన్ తెలియచేసుకుంది . సింధూ జలాల నిలిపివేత జరిగితే సింధూ నదిలో రక్తం పారుతుందని పాక్ మాజీ మంత్రి ఒకరు వ్యాఖ్యానించారు. దీనికి స్పందనగా ఇటీవలే ప్రధాని మోడీ నీళ్లు నెత్తురు కలిసి ప్రవహించవని బదులు ఇచ్చారు. ఉగ్రవాదానికి ఊతం నిలిపివేసి, దీనిని నిరూపించుకుంటేనే సింధూ జలాల ఒప్పందం తిరిగి కుదురుతుందని భారత ప్రభుత్వం స్పష్టం చేసింది. 1960లో సింధూ ఒప్పందం కుదిరింది. దీని మేరకు పలు నదుల్లో ప్రవాహ వాటాలపై నిర్ణయం ఖరారు అయింది. పాకిస్థాన్ సీమాంతర ఉగ్రవాదాన్ని నిలిపివేసేంత వరకూ, తమ దేశం అత్యంత వ్యూహాత్మకంగానే అంతర్జాతీయ ప్రామాణికలతోనే సింధూ ఒప్పందాన్ని అటకెక్కిస్తుందని భారత విదేశాంగ మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి రణదీప్ జైస్వాల్ ఇటీవల తెలిపారు, ఇక పాకిస్థాన్ నుంచి ఇప్పుడు వెలువడ్డ లేఖపై భారత వివేశాంగ మంత్రిత్వశాఖ ఏ విధంగా స్పందిస్తుందనేది ఇప్పటికైతే స్పష్టం కాలేదని అధికారులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News