Saturday, August 23, 2025

మొదటి పాట వచ్చేస్తోంది

- Advertisement -
- Advertisement -

హీరో ప్రదీప్ రంగనాథన్ ప్రస్తుతం మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘డ్యూడ్’(dude) లో నటిస్తున్నారు. కీర్తిశ్వరన్ దర్శకత్వంలో ఈ చిత్రం యువతకు నచ్చే ఎంటర్‌టైనర్ గా ఉండనుంది. ప్రదీప్‌కు జోడీగా ‘ప్రేమలు‘ ఫేమ్ మమిత బైజూ కథానాయికగా నటిస్తుండగా, సీనియర్ నటుడు శరత్ కుమార్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ‘డ్యూడ్’ ఫస్ట్ సింగిల్ బూమ్ బూమ్ (Boom boom) ఆగస్ట్ 28న రిలీజ్ కానుంది. సాంగ్ అనౌన్స్‌మెంట్ పోస్టర్ లో ప్రదీప్ రంగనాథన్, మమిత బైజూ ట్రెండీ, స్టయిలీష్ లుక్‌లో ఆకట్టుకున్నారు. దీపావళికి ఈ సినిమా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషలలో విడుదల కానుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News