Wednesday, June 4, 2025

అద్భుతంగా యాక్షన్ విజువల్స్

- Advertisement -
- Advertisement -

ఎన్టీఆర్ హృతిక్ రోషన్’ కలయికలో రాబోతున్న మోస్ట్ వాంటెడ్ పాన్ ఇండియా మల్టీస్టారర్ ‘వార్ 2’. (War 2) ఈ సినిమా ఆగస్టు 14, 2025 న థియేటర్స్‌లోకి రాబోతుంది. అయితే, తాజాగా ఈ సినిమా క్లైమాక్స్ గురించి ఓ క్రేజీ రూమర్ వినిపిస్తోంది. ఈ క్లైమాక్స్‌లో స్పెషల్ విఎఫ్‌ఎక్స్‌కి పెద్దపీట వేసి గ్రాండ్ లెవెల్లో తెరకెక్కిస్తున్నారట. కాబట్టి. వార్2 క్లైమాక్స్ విజువల్ ఎక్స్‌పీరియన్స్ ఓ లెవెల్లో ఉండబోతుందట. మొత్తానికి ఈ సినిమాలోని యాక్షన్ విజువల్స్ అత్యుత్తమంగా ఉంటాయని మేకర్స్ చెబుతున్నారు. అన్నట్టు ఈ సినిమాలో రెండు పాటలు మాత్రమే ఉన్నాయట.

పైగా అందులో ఒక సాంగ్‌ను హృతిక్ రోషన్ కియరాపై తీశారు. కియరా బికినీలో కనిపిస్తోందట. ఇక రెండో పాటను హృతిక్-, ఎన్టీఆర్‌పై షూట్( Hrithik,NTR shoot) చేయనున్నారు. వచ్చే నెల హృతిక్, -తారక్‌పై ఈ సాంగ్‌ను 7 రోజుల పాటు షూట్ చేస్తారట, ఈ సాంగ్‌లో తారక్ స్టెప్స్ అదిరిపోతాయని తెలుస్తోంది. కాగా, మోస్ట్ వాంటెడ్ పాన్ ఇండియా మల్టీస్టారర్స్ లో ‘వార్ 2’ ఫస్ట్ ప్లేస్‌లో ఉంటుంది. పైగా ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కలయిక అనగానే ఆడియన్స్‌లో కూడా భారీగా అంచనాలు పెరిగిపోయాయి. ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్రపై ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. నిర్మాత ఆదిత్య చోప్రా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News