గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న పాన్ -ఇండియా ప్రాజెక్ట్ ‘పెద్ది’.(peddi) నేషనల్ అవార్డ్ విన్నింగ్ ఫిలిం మేకర్ బుచ్చి బాబు సానా దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే సినిమా ఫస్ట్ షాట్ గ్లింప్స్‌తో దేశవ్యాప్తంగా భారీ అంచనాలను సృష్టించింది. ప్రముఖ పాన్-ఇండియా నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో విజనరీ వెంకట సతీష్ కిలారు తన ప్రతిష్టాత్మక బ్యానర్ వృద్ధి సినిమాస్ బ్యానర్ పై భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కన్నడ సూపర్‌స్టార్ శివరాజ్‌కుమార్ ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నారు.
శనివారం ఆయన పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ శివరాజ్‌కుమార్ ఫస్ట్ లుక్‌ని రిలీజ్ చేశారు. ఇంటెన్స్ చూపు, రఫ్ అండ్ టఫ్ లుక్‌తో శివరాజ్‌కుమార్ (Shivarajkumar tough look) కనిపించే తీరు అదిరిపోయింది. ఈ చిత్రంలో ‘గౌర్నాయుడు’ అనే పవర్ ఫుల్ క్యారెక్టర్ లో కనిపించబోతున్నారు. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, జగపతి బాబు, దివ్యేంద్రు శర్మ ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రం 2026 మార్చి 27న రామ్ చరణ్ పుట్టినరోజున ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.