- Advertisement -
హైదరాబాద్: పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లును మంత్రి సీతక్క ప్రవేశపెట్టారు. మున్సిపల్ చట్ట సవరణ బిల్లుకు శాసన సభ ఆమోదం తెలిపింది. మున్సిపల్ చట్టసవరణ బిల్లును శాసన సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. బిసిలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలనే ఆలోచనతో బిల్లుకు ఆమోదం తెలిపామని మంత్రి సీతక్క తెలిపారు. బిసిలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ కల్పిస్తూ చట్టసవరణను ప్రతిపాదిస్తున్నామని సీతక్క పేర్కొన్నారు. రాష్ట్రపతి దగ్గర బిసి బిల్లు పెండింగ్‌లో ఉండడంతోనే సవరణ చట్టాలు తీసుకొస్తున్నామని స్పష్టం చేశారు.
- Advertisement -