Sunday, July 13, 2025

ఎసిబికి చిక్కిన పంచాయతీరాజ్ ఎఇ

- Advertisement -
- Advertisement -

పెద్దపల్లి జిల్లా, కాల్వశ్రీరాంపూర్ మండల కేంద్రంలో అవినీతి నిరోధకశాఖ అధికారులు ఓదెల మండల పంచాయతీరాజ్ అసిస్టెంట్ ఇంజనీర్ పెందోట జగదీశ్‌బాబును రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఓదెల మండలం, బాయమ్మపల్లికి చెందిన కాంట్రాక్టర్ కావేటి రాజు నుండి రూ.90 వేలు లంచం డబ్బులను కాల్వశ్రీరాంపూర్ మండల కేంద్రంలోని ప్రధాన రహదారిపైనే తీసుకుంటుండగా ఎసిబి అధికారులు పట్టుకున్నారు. ఎసిబి డిఎస్‌పి విజయ్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకా రం.. కాల్వశ్రీరాంపూర్ మండలం, వెన్నంపల్లి గ్రామం లో రూ.15 లక్షల విలువైన సిసి రోడ్డు, ఓదెల మండలంలోని మూడు సిసి రోడ్ల నిర్మాణ అభివృద్ధి పనులకు సంబంధించి ఎఇ రూ.లక్ష లంచం డిమాండ్ చేసి

రూ. 90 వేలకు ఒప్పందం చేసుకున్నా డు. దీంతో బాధితుడు ఎసిబి అధికారులను ఆశ్రయించడం తో వారి సూచనల మేరకు కా రులో వస్తుండగా కాల్వశ్రీరాంపూర్ మండల పరిషత్ కార్యాలయం ముందున్న ప్రధాన రహదారిపైనే కాంట్రాక్టర్ రాజు నుండి లంచం తీసుకుంటున్న సమయంలో పంచాయతీరాజ్ ఎఇని వలపన్ని పట్టుకున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకొని తదుపరి విచారణ అనంతరం జిల్లా కేంద్రంలోని పంచాయతీరాజ్ ఎస్‌సి కార్యాలయంలో విచారణ చేపట్టగా, జగదీశ్ వద్ద పేపర్లు, నగదు లభించాయి. తమకు దొరికిన ఆధారాలతో కేసు నమోదు చేసి నిందితుడిని రిమాండ్‌కు తరలించామని ఎసిబి డిఎస్‌పి విజయ్‌కుమార్ తెలిపారు. ఆయన వెంట ఇద్దరు సిఐలు కృష్ణకుమార్, తిరుపతితోపాటు సిబ్బంది ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News