Monday, May 12, 2025

పంచాయతీ కార్యదర్శుల సమస్యలు పరిష్కరిస్తాం: సీతక్క

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: పంచాయతీ కార్యదర్శుల సమస్యలు పరిష్కరిస్తామని మంత్రి సీతక్క తెలిపారు. పంచాయతీ కార్యదర్శుల ఆత్మీయ సమ్మేళనంలో మంత్రీ సీతక్క, పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడారు. బిఆర్‌ఎస్ ప్రభుత్వం విధ్వంసం అందరికీ తెలుసునని, ప్రభుత్వ పథకాలను కార్యదర్శులు ప్రజల దగ్గరకు చేర్చాలని సూచించారు. గతంలో గ్రామాలలో విఆర్‌ఎ, విఆర్‌ఒలు ఉండేవారని, వాళ్లు చేసే పనులు కూడా పంచాయతీ కార్యదర్శులపై పడడంతో పని ఒత్తిడి పెరిగిందన్నారు. పంచాయతీ కార్యదర్శుల డిమాండ్లను పరిష్కరిస్తామని, కొంచెం సమయం పడుతుందని సీతక్క తెలిపారు.  పంచాయతీ రాజ్ శాఖలో చిక్కులు ముడులు లేకుండా సమస్యలను పరిష్కరిస్తామన్నారు. నెలలో రెండో, నాలుగో శుక్రవారం అధికారులతో సమావేశాం ఏర్పాటు చేస్తామని సీతక్క వివరించారు. ఈ నెల 25 వరకు రెగ్యులరైజేషన్, ప్రమోషన్, నాలుగు సంవత్సరాల సర్వీసు గురించి అధికారులతో తాము చర్చించి నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News