Friday, August 29, 2025

ఎసిబికి చిక్కిన పంచాయతీ కార్యదర్శి… పటాకులు కాల్చి సంబరాలు చేసుకున్న గ్రామస్తులు

- Advertisement -
- Advertisement -

అవినీతి నిరోదక శాఖ(ఎసిబి) వలలో మరో అవినీతి చెేప చిక్కింది. లంచం తీసుకుంటూ ఓ పంచాయతీ కార్యదర్శి అడ్డంగా దొరికిపోయాడు. కరీంనగర్‌ జిల్లాలోని వీణవంక మండలం చల్లూరు గ్రామంలో కొత్తగా కట్టుకున్న ఇంటికి నెంబర్ ఇవ్వడానికి పంచాయతీ కార్యదర్శి నాగరాజు రూ.20 వేలు లంచం డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు ఎసిబి అధికారులను ఆశ్రయించాడు. పక్కా ప్లాన్ ప్రకారం బాధితుడి నుంచి లంచం తీసుకుంటుండగా పంచాయతీ కార్యదర్శిని ఎసిబి అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అదుపులోకి తీసుకున్న ఎసిబి అధికారులు కేసు నమోదు చేసి విచారించనున్నట్లు తెలిపారు. ఇక, లంచాలతో తమను పీడించిన పంచాయతీ కార్యదర్శిని ఎసిబి పట్టుకోవడంతో చల్లూరు గ్రామస్తులు పటాకులు కాల్చి సంబరాలు చేసుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News